జీహెచ్ఎంసీ మాజీ మేయర్ బండ కార్తిక రెడ్డి, చంద్రారెడ్డి.. భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి భూపేంద్ర యాదవ్, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి, ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సమక్షంలో కమలం పార్టీలో చేరారు. కండువా కప్పి భాజపాలోకి ఆహ్వానించారు భూపేంద్ర యాదవ్.
సముచిత స్థానం కల్పిస్తాం
కార్తిక రెడ్డికి భాజపాలో సముచిత స్థానం కల్పిస్తామని ఆ పార్టీ నేతలు హామీ ఇచ్చారు. జీహెచ్ఎంసీ ఎన్నికల మేనిఫెస్టో రూపకల్పన, సలహాల, సూచనల కోసం ఏర్పాటుచేసిన కాల్‌సెంటర్‌ను భూపేంద్ర యాదవ్ ప్రారంభించారు. కాల్‌సెంటర్‌కు వచ్చిన సమస్యలను మేనిఫెస్టోలో పొందుపరుస్తామని తెలిపారు.
హిందువుల హక్కుల కోసం..
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఏం జరగబోతోందోనని దేశం మొత్తం చూస్తోందని బండి సంజయ్ అన్నారు. కేసీఆర్ నియంత, కుటుంబ పాలనకు వ్యతిరేకంగా దుబ్బాకలో భాజపాను గెలిపించారన్నారు. పదివేల ఆర్థిక సాయం కోసం లైన్లో నిలబడి ఓ వ్యక్తి మృతి చెందాడని బండి సంజయ్ ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్.. హైదరాబాద్‌ను మజ్లిస్‌కు అప్పగించారని.. 80 శాతం ఉన్న హిందువుల హక్కుల కోసం భాజపా పని చేస్తోందని సంజయ్ స్పష్టం చేశారు.
కాంగ్రెస్ మోసం చేసింది..
కాంగ్రెస్.. రెండు సార్లు తనకు సీటు ఇవ్వకుండా మోసం చేసిందని కార్తికరెడ్డి ఆరోపించారు. న్యాయం జరుగుతుందనే భాజపాలో చేసినట్లు తెలిపారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని.. 150 డివిజన్లలో భాజపా అభ్యర్థుల తరఫున ప్రచారం చేస్తానని వెల్లడించారు. ఏ పదవి ఆశించి కమలం పార్టీలో చేరలేదని.. తన పనితనం చూసి..పదవులు ఇవ్వాలని పార్టీ నాయకత్వాన్ని కోరినట్లు తెలిపారు. తెరాసకు ప్రత్యామ్నాయం భాజపానేనని స్పష్టం చేశారు.
ఇవీచూడండి: దుబ్బాక ఎమ్మెల్యేగా రఘునందన్‌రావు ప్రమాణం