హైదరాబాద్ నగరంలో వీధి కుక్కల నియంత్రణకు పైలెట్ ప్రాజెక్టులో భాగంగా ఐదు వార్డులను ఎంపిక చేసినట్లు జీహెచ్ఎంసీ చీఫ్ వెటర్నరీ అధికారి అబ్దుల్ వఖీల్ తెలిపారు. ఈ ఐదు వార్డుల్లో 100 శాతం వీధి కుక్కలకు కుటుంబ నియంత్రణ స్టెరిలైజేషన్తో పాటు యాంటీ ర్యాబీస్ వ్యాక్సినేషన్ చేస్తున్నట్లు ఆయన వివరించారు.
గ్రేటర్ పరిధిలోని ఐదు వార్డుల వివరాలు
- హయత్‌నగర్ సర్కిల్లో నాగోల్- 11 వార్డు
- చుడీ బజార్ యానిమల్ కేర్ సెంటర్ పరిధిలోని చార్మినార్ సర్కిల్లో ఉన్న శాలిబండ- 48 వార్డు
- పటేల్‌నగర్ యానిమల్ కేర్ సెంటర్ పరిధిలోని మెహిదీపట్నం సర్కిల్లో ఉన్న ఆసిఫ్‌నగర్- 72 వార్డు
- కేపీహెచ్‌బీ కాలనీ యానిమల్ కేర్ సెంటర్ పరిధిలోని శేరిలింగంపల్లి సర్కిల్లో శేరిలింగంపల్లి- 106 వార్డు
- మహదేవ్‌పూర్ యానిమల్ కేర్ సెంటర్ పరిధిలో ఉన్న గాజులరామారం సర్కిల్‌లోని గాజులరామారం -125 వార్డు
ఈ ఐదు వార్డులలో దాదాపు 20వేల వీధి కుక్కలుండగా... ఇప్పటి వరకు 1,179 వీధి కుక్కలకు కుటుంబ నియంత్రణ స్టెరిలైజేషన్, 2,016 వీధి కుక్కలకు యాంటి రాబిస్ వ్యాక్సినేషన్ చేసినట్లు వివరించారు.