జీహెచ్‌ఎంసీ పరిధిలో ట్రాఫిక్ ఎక్కువగా ఉన్న రోడ్లను గుర్తించామని జీహెచ్‌ఎంసీ కమిషనర్ లోకేశ్ కుమార్ తెలిపారు. ఫిబ్రవరి కల్లా ఈ రోడ్లను విస్తరించి ట్రాఫిక్ లేకుండా చేస్తామన్నారు. నగరంలో ముఖ్యమైన పర్యటక ప్రాంతాలున్నాయని వీటిని చూసేందుకు దేశ, విదేశాల నుంచి పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారని పేర్కొన్నారు. పర్యటకులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్న ఈ ప్రాంతాల్లో 24 గంటలు పారిశుద్ధ్యం పనులు జరుగుతాయని లోకేశ్ కుమార్ తెలిపారు.
ఇవీ చూడండి: ఎంఎంటీఎస్ ప్రమాదానికి పనిఒత్తిడే కారణమా!?