కరోనాను కట్టడి చేయడానికి స్వీయ నియంత్రణ పాటించడమొకటే మార్గమని జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్ కుమార్ తెలిపారు. రోజురోజుకు విజృంభిస్తోన్న కరోనా కేసుల్ని కట్టడి చేసేందుకు నగరవాసుల భాగస్వామ్యం అవసరమని కోరారు. ఆరు నియమాలు విధిగా పాటించాలని సూచించారు.
1. వయసు: పదేళ్ల కంటే తక్కువ వయసున్నవారు, 60 ఏళ్లు పైబడిన వారు ఇళ్లకే పరిమితమవ్వాలి.
2. మాస్కులు మరవొద్దు: బయట అడుగుపెడితే మాస్కు మరవొద్దు. ప్రతి ఒక్కరితో ఆరు అడుగుల దూరం పాటించడం వ్యక్తిగత విధి.
3. పనిప్రాంతం: పని ప్రదేశాల్లో శానిటైజర్లు, చేతులు శుభ్రం చేసుకునేందుకు ద్రావకాలు ఏర్పాటు చేయాలి. భౌతిక దూరం తప్పనిసరి చేయాలి.
4. ప్రయాణమొద్దు: అనవసరంగా ఎక్కడికీ ప్రయాణం చేయొద్దు. తప్పనిసరైతే మాస్కులు, ఎడం తప్పక పాటించాలి.
5. సంప్రదించండి: జలుబు, దగ్గు, శ్వాస సంబంధిత సమస్యలు తలెత్తితే వెంటనే స్థానిక ప్రభుత్వాసుపత్రిని సందర్శించాలి. హెల్ప్‌లైన్ నంబరుకి సమాచారం ఇవ్వాలి.
6. వీరు జాగ్రత్త: మధుమేహులు, శ్వాస, గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న వారు ప్రయాణాలు చేయొద్దు. ఇంటికే పరిమితమవ్వాలి.
- ఇదీ చదవండి: దొంగకు కరోనా ఉంటే.. వణికిపోతున్న పోలీసులు.!