గ్రేటర్ పరిధిలో ప్రభుత్వ భూముల ఆక్రమణలపై బల్దియా యంత్రాంగం సీరియస్‌గా స్పందించింది. హుస్సేన్‌సాగర్ పరిధిలో అక్రమంగా ఏర్పాటు చేసిన వెంచర్‌ను సికింద్రాబాద్ జోనల్ అధికారులు కూల్చివేశారు. 6 జేసీబీలు, 30 మంది సిబ్బందితో నిర్మాణాలను.. వెంచర్‌ను కూల్చివేసినట్లు జోనల్ కమిషనర్ శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు.
ప్రభుత్వ భూములు, చెరువులు, సరస్సులను కాపాడేందుకు పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నట్లు శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు. అక్రమ లేఅవుట్‌లు, నిర్మాణాలను ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. అక్రమ వెంచర్లు, నిర్మాణాలను తొలగించడమే కాకుండా అట్టి చర్యలకు పాల్పడిన వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.