కుటుంబ సభ్యలతో సరదాగా సీసీఎస్ పోలీసులు హైదరాబాద్లో సీసీఎస్ పోలీసుల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా జరిగింది. అధికారులంతా కుటుంబసభ్యులతో ఆటపాటలతో గడిపారు. పిల్లల సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యాక్రమానికి ముఖ్య అతిథిగా రాచకొండ కమిషనర్ అంజనీ కుమార్ పాల్గొన్నారు. ఈ ఆత్మీయ సమ్మేళనంకు హాజరవటం సంతోషంగా ఉందని అన్నారు. తాము ఏదైనా కేసును ఛేదించామంటే అది కుటుంబ సభ్యుల సహకారం వల్లనేనని తెలిపారు.
తమ తల్లిదండ్రులు పోలీస్ శాఖలో పని చేయడం గర్వంగా ఉందని, వాళ్ళు ఆ ఉద్యోగాన్ని ఎంతో బాధ్యతతో నిర్వహిస్తున్నారని అధికారుల పిల్లలు హర్షం వ్యక్తం చేశారు.