ETV Bharat / state

విశాఖ పరవాడలోని ఫార్మా కంపెనీలో గ్యాస్ లీక్...ఇద్దరు మృతి - ap latest news

gas leakage at paravad pharma city in vishakapatnam
విశాఖ పరవాడలోని ఫార్మా కంపెనీలో గ్యాస్ లీక్...ఇద్దరు మృతి
author img

By

Published : Jun 30, 2020, 6:04 AM IST

Updated : Jun 30, 2020, 8:31 AM IST

06:02 June 30

విశాఖ పరవాడలోని ఫార్మా కంపెనీలో గ్యాస్ లీక్...ఇద్దరు మృతి

విశాఖ పరవాడలోని ఫార్మా కంపెనీలో గ్యాస్ లీక్...ఇద్దరు మృతి

విశాఖ పరవాడ ఫార్మా సిటీలోని సాయినార్ లైఫ్​ సైన్సెస్​​ ఫార్మా కంపెనీలో ప్రమాదం జరిగింది. అర్ధరాత్రి దాటాక రియాక్టర్ నుంచి బెంజిన్​ లీక్​ అయ్యింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా​.. నలుగురు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వీరిని గాజువాక ఆస్పత్రికి తరలించారు. బాధితుల్లో ఒకరు వెంటిలేటర్​పై చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమంగా ఉన్న బాధితుణ్ని కేజీహెచ్​కు తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. మృతులు షిఫ్ట్​ ఇంఛార్జీ నరేంద్ర, కెమిస్ట్​ గౌరీశంకర్​గా గుర్తించారు. నరేంద్రది గుంటూరు జిల్లా తెనాలి కాగా.. గౌరీశంకర్​ విజయనగరానికి చెందినవారు. 

సమాచారం అందుకున్న జిల్లా కలెక్టర్​ వినయ్​చంద్​, సీపీ ఆర్కే మీనా ఫార్మా సంస్థను  సందర్శించారు. ప్రమాదం జరిగిన తీరు, భద్రతా లోపాలను పరిశీలించారు. పరిసర ప్రాంతాలపై ఏమైనా ప్రభావం ఉందా అనేది పరిశీలిస్తున్నారు.

ఎఫ్​ఐఆర్​ నమోదు

సాయినార్​ కంపెనీపై ఎఫ్​ఐఆర్​ నమోదు చేసినట్లు విశాఖ సీపీ ఆర్కే మీనా తెలిపారు. బాయిలర్​లో తెల్లవారుజామున లోపం తలెత్తి గ్యాస్​ లీకైనట్లు వివరించారు. మృతుల్లో షిఫ్ట్ ఇన్‌ఛార్జి నరేంద్ర, కెమిస్ట్​ గౌరీ శంకర్​గా గుర్తించామని అన్నారు. బాధితులు సూర్యనారాయణ, చంద్రశేఖర్​, జానకిరావు, ఆనంద్​బాబులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు పేర్కొన్నారు. మూడేళ్ల క్రితం ఇదే సంస్థలో రియాక్టర్‌ పేలి ఇద్దరు మృతి చెందినట్లు తెలిపారు. గతంలో జరిగిన ప్రమాదంపైనా విచారణ చేస్తున్నట్లు వెల్లడించారు.

ఇదీ చదవండి: 59 చైనా యాప్​లపై నిషేధం

Last Updated : Jun 30, 2020, 8:31 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.