మత్స్యకారుల ఉనికిని దెబ్బ తీసేలా ఉన్న జీవో నంబర్ 6ను తక్షణమే రద్దు చేయాలని గంగపుత్ర ఐకాస రాష్ట్ర అధ్యక్షులు సుదర్శన్ డిమాండ్ చేశారు. 17వ తేదీన సీఎం కేసీఆర్ జన్మదిన సందర్భంగా.. ప్రగతి భవన్‌లో తమ సమస్యలు విన్నవించుకోనేందుకు అవకాశమివ్వాలని కోరారు. హైదరాబాద్ బషీర్‌బాగ్‌లోని ప్రెస్ క్లబ్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
నూతన మత్స్య సొసైటీలను ఏర్పాటు చేసి.. గంగపుత్రులకు తొలి ప్రాధాన్యత కల్పించాలని సుదర్శన్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఫిషరీస్ ఛైర్మన్ పదవి తమకే ఇవ్వాలన్నారు. కులవృత్తికి సంబంధించిన నేతల అనుమతితోనే ఇతర కులాల వారు చేపలు పట్టుకునేలా జీవో తీసుకురావాలని ఆయన డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: త్వరలో కొత్త రేషన్ కార్డులు మంజూరు చేస్తాం: కేసీఆర్