ETV Bharat / state

గంగమ్మా.. శాంతించు.. గండిపేటలో ఘనంగా గంగ తెప్పోత్సవం - gangamaatha blessings

హైదరాబాద్ అంబర్​పేటలోని తిలక్​నగర్ శ్రీ గంగపుత్ర సంఘం ఆధ్వర్యంలో గండిపేట చెరువు వద్ద గంగ తెప్పోత్సవం వైభవంగా జరిపించారు. తెప్పోత్సవం ఛైర్​పర్సన్ పూస నరసింహ బెస్త ఆధ్వర్యంలో గండిమైసమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించారు.

గంగమ్మా.. శాంతించు.. గండిపేటలో ఘనంగా గంగ తెప్పోత్సవం

author img

By

Published : Oct 24, 2020, 4:48 AM IST

హైదరాబాద్ అంబర్​పేటలోని తిలక్​నగర్ శ్రీ గంగపుత్ర సంఘం ఆధ్వర్యంలో గండిపేట చెరువు వద్ద గంగ తెప్పోత్సవం వైభవంగా జరిపించారు. గంగతెప్పను శిరస్సుపైన ధరించిన తెప్పోత్సవం ఛైర్మన్ పూస నరసింహ బెస్త, గంగపుత్రులతో కలిసి గండిపేటకు ఊరేగింపుగా తరలివెళ్లారు.

ఎడతెరిపి లేని భారీ వర్షాలకు చెరువులు, కుంటలు, వాగులన్నీ నిండి మత్తడి దూనుకుతున్నాయని ఆయన పేర్కొన్నారు. ఈ క్రమంలో అధిక నీటి ఒత్తిడితో చెరువు కట్టలు తెగి నగర వాసుల నివాసాలను వరద ముంచెత్తెడంపై నరసింహ ఆందోళన వ్యక్తం చేశారు. ఫలితంగా తిండి లేక నిరాశ్రయులైన ప్రజలను కాపాడాలని అమ్మవారికి పసుపు కుంకుమ సమర్పించినట్లు పేర్కొన్నారు. గంగామాతను ఉగ్రరూపం వదిలి శాంతించమని వేడుకుంటూ శోభాయాత్ర ఘనంగా నిర్వహించారు.

అందువల్లే ఇలా..

గంగపుత్ర కులస్థుల జీవనోపాధిని ప్రభుత్వమే దెబ్బతీసిందని.. దాని పర్యావసనమే గంగపుత్రుల ఉసురు ప్రభుత్వానికి తగిలిందని నరసింహ అభిప్రాయపడ్డారు. ఎన్నికల్లో రాజకీయ పార్టీలన్నీ కుట్రతో గంగపుత్రులను ఓటు బ్యాంకు రాజకీయాలకు వాడుకుంటున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం జీఓ నెం.6ను రద్దు చేస్తేనే తమ కుల దైవం గంగమ్మ తల్లి శాంతిస్తుందని ఆయన వివరించారు.

సర్వ మానవాళి క్షేమానికి ..

సర్వ మానవాళి సుఖ శాంతులతో వర్థిల్లాలని ఏటా తమ కులస్థులు గంగపుత్ర సంఘం ఆధ్వర్యంలో గంగ తెప్పోత్సవం నిర్వహిస్తామని అంబర్​పేట గంగపుత్ర సంఘం అధ్యక్షుడు కాపురవేని లింగం బెస్త స్పష్టం చేశారు. కార్యక్రమంలో గంగపుత్ర సంఘం సభ్యులు కాపరవేని రాజబోస్ బెస్త, నర్సింగ్ రావు బెస్త, ముడారి శ్రీనువాస్ బెస్త సహా యువత కుల బంధువులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

గంగమ్మా.. శాంతించు.. గండిపేటలో ఘనంగా గంగ తెప్పోత్సవం

ఇవీ చూడండి : ఉద్యోగులకు తీపి కబురు.. డీఏ పెంచుతూ ఉత్తర్వులు జారీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.