వినాయక నవరాత్రులు పూర్తి కావడంతో వినాయక ప్రతిమలు గంగమ్మ వడికి చేరుతున్నాయి. హైదరాబాద్ గుడిమల్కాపూర్ నవోదయ కాలనీలోని ప్రసన్న ఆంజనేయ స్వామి దేవాలయంలో మట్టి వినాయక విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. భక్తి శ్రద్ధలతో నవరాత్రి పూజలు నిర్వహించారు.
ఆఖరి రోజున జరిపే గణనాథుని నిమజ్జన కార్యక్రమాన్ని ఆలయంలోనే చిన్నపాటి కొలను ఏర్పాటు చేసి వైభవంగా పూర్తి చేశారు. నిమజ్జనం ద్వారా వెలువడిన మట్టి నీటిని ప్రజలకు పంపిణీ చేస్తారు. భక్తితో వాటిని ప్రజలు తులసి మొక్కలకు వేస్తారు.
ఇవీ చదవండి: శ్రీశైలం ఆలయాన్ని దర్శించుకున్న హైకోర్టు సీజే మహేశ్వరి