Ganesh Chaturthi Celebrations 2023 Telangana : రాష్ట్ర వ్యాప్తంగా నవరాత్రి ఉత్సవాలను ఏడోరోజు భక్తులు ఘనంగా నిర్వహించారు. వినాయక మండపాల వద్ద వివిధ కార్యక్రమాలను జరిపారు. గణనాథుడికి ప్రత్యేక పూజలు చేసి.. పాడిపంటలతో అందరూ సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని కోరుకున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో ప్రారంభమైన నిమజ్జనాలకు ఇప్పటికే అధికారులు ముమ్మర ఏర్పాట్లు చేశారు.
Ganesh Chaturthi in Warangal : తెలంగాణలో లంబోదరుడి పూజలు అట్టహాసంగా జరుగుతున్నాయి. వరంగల్ జిల్లా రాయపర్తి మండలం తిరుమలాయపల్లిలో పార్వతీ తనయుడికి రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొని భక్తులకు అన్నం వడ్డించారు. గ్రామ పెద్దలతో కలిసి సహపంక్తి భోజనం చేసిన మంత్రి రాష్ట్ర ప్రజలకు ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు సిద్ధించాలని.. పాడి పంటలతో రాష్ట్రం సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని కోరుకున్నట్లు తెలిపారు.
Ganesh Navaratri Celebrations 2023 In Hyderabad : హైదరాబాద్‌లోనూ చవితి నవరాత్రులు ఘనంగా జరుగుతున్నాయి. ఓ గణనాథుడి చేతిలో ఏర్పాటు చేసిన బంగారు లడ్డు వేలం జరిగింది. నిమజ్జనం రోజు 15 కిలోల లడ్డుతో కలిపి ఈ తులం బంగారు లడ్డును వేలం వేశారు. వేయి 116 రూపాయల ధరతో వేలం పాట మొదలు కాగా.. ఒక లక్ష 36 వేలకు హిమాయత్ నగర్‌కు చెందిన సంధ్య రాణి అనే మహిళ లడ్డును దక్కించుకుంది.
సికింద్రాబాద్‌లోని హనుమాన్‌సేన మండల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గరుడ గణపతి చూపరులను విశేషంగా ఆకట్టుకుంటున్నాడు. మానస సరోవర్ ఆధ్యాత్మిక కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ విశేషంగా ఆకట్టుకున్నాయి. గత 13 సంవత్సరాలుగా గణపతి నవరాత్రి మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు.
హయత్‌నగర్‌లోని శోభానగర్లో విఘ్ననాధుడిని ఘనంగా డప్పుచప్పుళ్ల మధ్య ఊరేగించి నిమజ్జనం చేశారు. మరోవైపు ఏడు రోజులు పూజలందుకున్న ఘననాథుడ్ని భక్తులు సాగరానికి తరలిస్తున్నారు. సరూర్ నగర్‌లోని మినీ ట్యాంక్‌బండ్‌లో వినాయక నిమజ్జనం చేస్తున్నారు. భక్తుల భద్రత దృష్ట్యా అధికారులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. ఏడవ రోజు 800 గణేష్ విగ్రహాలు నిమజ్జనమైనట్లు అధికారులు తెలిపారు.
Ganesh 108 Prasadam Naivedyam : వినాయకుడికి 108 రకాల ప్రసాదాలు.. ఇంతకీ ఎక్కడ..?
Hyderabad Ganesh Nimajjanam 2023 : మరోవైపు వినాయక నిమజ్జనోత్సవాలు భక్తుల కోలాహలం మధ్యన కొనసాగుతున్నాయి. వినాయక చవితి నుంచి పూజలందుకున్న గణనాథుడు గంగమ్మ ఒడికి చేరుకుంటున్నాడు. పాతబస్తీ సహా అన్ని ప్రధాన ప్రాంతాల నుంచి వినాయక విగ్రహాలను భక్తులు పెద్దఎత్తున ఊరేగింపు మధ్య ట్యాంక్‌బండ్‌కు తరలిస్తున్నారు. అలాగే పోలీసులు ముందు జాగ్రత్తగా ట్యాంక్‌బండ్ పరిసరాల్లో భద్రతా ఏర్పాట్లు చేశారు.
Kalasha Ganesh Idol in Nizamabad : 1500 కలశాలతో బొజ్జ గణపయ్య.. చూస్తే వావ్ అనాల్సిందే!