ETV Bharat / lifestyle

షుగర్​ను తగ్గించే 'మినుముల పులగం' ఎప్పుడైనా తిన్నారా? శరీరానికీ ఎంతో బలాన్ని ఇస్తుందట! - MINUMULA PULAGAM RECIPE IN TELUGU

-రోగాలు నయం చేసే ఆయుర్వేదిక్ రెసిపీ -లంచ్, డిన్నర్​కు బాగా సరిపోతుందట!

Minumula Pulagam Recipe in Telugu
Minumula Pulagam Recipe in Telugu (ETV Bharat)
author img

By ETV Bharat Lifestyle Team

Published : Jan 29, 2025, 3:10 PM IST

Minumula Pulagam Recipe in Telugu: ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్న మినుముల పులగం ఎప్పుడైనా తిన్నారా? చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ ఎంతో పుష్టిని ఇచ్చే వంటకం. ఇది డయాబెటిస్ ఉన్నవారికి, బరువు తగ్గాలని అనుకునే వారికి మంచిదని నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా ఇందులోని మినుములు షుగర్ లెవల్స్ అదుపులో ఉంచడానికి సహాయం చేస్తుందని చెబుతున్నారు. 2017లో Journal of Clinical and Diagnostic Researchలో ప్రచురితమైన "Effect of Black Gram (Vigna mungo) on Glycemic Control and Insulin Sensitivity in Patients with Type 2 Diabetes Mellitus" అనే అధ్యయనంలోనూ ఈ విషయం తేలింది.(రిపోర్ట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) ఇంకా ఇందులోని క్యాల్షియం ఎముకలను బలంగా చేస్తుందని తెలిపారు. ఈ మినుముల పులగాన్ని ఏదైనా రోటీ పచ్చడి, పప్పు, పప్పు చారు, మజ్జిగతో ఎంతో రుచిగా ఉంటుంది. ఈ నేపథ్యంలోనే మినుముల పులగం చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం.

కావాల్సిన పదార్థాలు

  • అర కప్పు పొట్టు మినపప్పులు
  • అర కప్పు కడిగిన బియ్యం
  • ఒక టీ స్పూన్ మెంతులు
  • 6-7 వెల్లుల్లి
  • రుచికి సరిపడా ఉప్పు
  • అర కప్పు పచ్చి కొబ్బరి తురుము
  • ఒక టేబుల్ స్పూన్ నువ్వుల నూనె
  • 2 పచ్చి మిరపకాయలు
  • అర టీ స్పూన్ జీలకర్ర
  • 2 రెబ్బల కరివేపాకు

తయారీ విధానం

  • ముందుగా స్టౌ ఆన్ చేసి ఓ గిన్నెలో మినుములు వేసి సన్నటి మంటపై ఎర్రగా వేయించుకుని పక్కకు పెట్టుకోవాలి.
  • ఆ తర్వాత కుక్కర్​లో కడిగిన బియ్యం, వేయించుకున్న మినుములు, మెంతులు, వెల్లుల్లి, ఉప్పు, మూడున్నర కప్పుల నీళ్లు పోసి మూత పెట్టి నాలుగు విజిల్స్ వచ్చేంతవరకు ఉంచుకోవాలి.
  • ఇలా మెత్తగా ఉడికిన పులగంలో పచ్చి కొబ్బరి తురుము వేసుకుని బాగా కలపాలి.
  • మరోవైపు స్టౌపైన ఓ కడాయి పెట్టుకుని నువ్వుల నూనె పోసి వేడి చేసుకోవాలి.
  • ఇందులోనే పచ్చి మిరపకాయలు, కరివేపాకు, జీలకర్ర వేసి ఎర్రగా వేయించుకోవాలి.
  • అనంతరం ఈ తాళింపు మిశ్రమాన్ని పులంగంలో పోసి బాగా కలిపితే టేస్టీ మినుముల పులగం రెడీ!

పులిహోర కలుపుతున్నారా? ఈ టిప్స్ పాటిస్తేనే సూపర్ టేస్ట్! మీరు ట్రై చేయండి!

నూనె లేకుండానే టేస్టీ 'చిల్లీ చికెన్'- ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్​లో చేసుకోవచ్చు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.