ETV Bharat / state

గృహావసరాల పేరుతో కమర్షియల్​గా అమ్ముకుంటున్నారు! - ILLEGAL DOMESTIC WATER PIPES

గృహ అవసరాల పేరుతో వాణిజ్య భవనాలకు ఉచిత నీరు - ఆదాయానికి గండి చర్యలపై దృష్టిపెట్టిన జలమండలి

Free water Issue In Hyderabad
Free water For Commercial Buildings (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jan 29, 2025, 2:38 PM IST

Free water For Commercial Buildings : హైదరాబాద్​లో గృహ అవసరాల పేరుతో నీటి కనెక్షన్లు తీసుకుని వాణిజ్య అవసరాలకు వినియోగించుకుంటున్నారు. దీంతో జలమండలి రాబడికి గండిపడుతోంది. జలమండలి రాబడిపై అక్రమ కనెక్షన్లకు తోడు వాణిజ్య అవసరాలకు ఉచిత నీటిని ఉపయోగించుకుంటున్నారు. రాబడి పెంచుకునేందుకు జలమండలి గుర్తిస్తున్న వివిధ అంశాల్లో దీని ప్రభావం నష్టాన్ని కలిగిస్తుంది.

ఉచిత నీరు పక్కదారి : ప్రస్తుతం నగరంలో గృహ అవసరాలకు నెలకు 20వేల లీటర్ల నీటిని ఉచితంగా ఇస్తున్నారు. దీంతో గృహ అవసరాల పేరుతో కనెక్షన్లు భారీగా పెరిగాయి. నగరంలో కాలనీల్లో కమర్షియల్‌ భవనాల సంఖ్య భారీగా పెరిగింది. జీహెచ్‌ఎంసీలో ఇళ్ల పేరుతో నిర్మాణ అనుమతులు తీసుకుంటున్నారు. ఆ తర్వాత వాణిజ్య భవనాలు నిర్మించుకుంటున్నారు. ఇలాంటి వాటికి జలమండలిలో డొమెస్టిక్‌ పేరుతో నీటికనెక్షన్లు తీసుకుంటున్నారు. వీటిల్లో హోటళ్లు, రెస్టారెంట్లు, షోరూంలు, వర్క్‌షాపులు నిర్వహిస్తూ ఉచిత నీటిని భారీగా వాడుకుంటున్నారు.

సమగ్ర పరిశీలనతో : జలమండలి పరిధిలో 13.71 లక్షల నీటి కనెక్షన్లుండగా వీటిలో 8.5లక్షల కనెక్షన్లు ఉచిత నీటి పథకంలో ఉన్నాయి. మిగిలిన వాటిలో బహుళ అంతస్తుల భవనాలు, కమర్షియల్‌ కనెక్షన్లు, పరిశ్రమలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో జలమండలి ప్రత్యేక దృష్టి సారిస్తోంది. సమగ్ర పరిశీలన జరిపి డొమెస్టిక్‌ కనెక్షన్లు తీసుకొని కమర్షియల్‌గా వాడుకుంటున్న వాటిని గుర్తించి వాటిని కమర్షియల్‌ కేటగిరిలోకి మార్చడం ద్వారా రాబడి పెరుగుతుందని భావిస్తున్నారు. కొత్తగా కనెక్షన్లు ఇచ్చేటప్పుడు కూడా ఏ కేటగిరిలో తీసుకున్నారు? అక్కడ ఎలాంటి నిర్మాణం జరుగుతోంది అనే అంశాలను నిర్ధారించుకోవడం ద్వారా ఆరంభంలోనే అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు అవకాశం ఉంటుందని అధికారులు అభిప్రాయపడ్డారు.

వాటర్ మీటర్ చెడిపోయిందా - జేబు గుళ్ల కావాల్సిందే! - గ్రేటర్​లో ఉచిత జలాల్లో సిబ్బంది చేతివాటం - Water Meter Problems in Greater Hyd

హైదరాబాద్​ వాసులకు అలర్ట్​ : వారందరికీ నల్లా కనెక్షన్​ కట్​ - అధికారుల కీలక నిర్ణయం! - Key Decision on Water Pending Bills

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.