ETV Bharat / state

ఐసోలేషన్ కేంద్రానికి ఆక్సిజన్ కాన్సెంట్రేటర్ల పంపిణీ

author img

By

Published : Jun 7, 2021, 9:59 AM IST

కరోనా బాధితులు ఎలాంటి అధైర్యానికి గురికావద్దని కార్పొరేటర్ పావని వినయ్ కుమార్ సూచించారు. జవహార్​నగర్​లోని నమో ఐసోలేషన్ కేంద్రానికి ఆక్సిజన్ కాన్సెంట్రేటర్లను పంపిణీ చేశారు. అత్యవసరమైన వారు ఆక్సిజన్ కాన్సెంట్రేటర్ల కోసం తమ హెల్ప్ లైన్ నంబర్​లను సంప్రదించాలని కోరారు.

Gandhinagar corporator Pavani distributes oxygen concentrators to Jawahar Nagar Namo Isolation Center

హైదరాబాద్ జవహార్​నగర్​లోని నమో ఐసోలేషన్ కేంద్రానికి ఆక్సిజన్ కాన్సెంట్రేటర్లను కార్పొరేటర్ పావని వినయ్ కుమార్ పంపిణీ చేశారు. కరోనా బాధితులు ఎలాంటి అధైర్యానికి గురికావద్దని కార్పొరేటర్ సూచించారు. అత్యవసరమైన వారు ఆక్సిజన్ కాన్సెంట్రేటర్ల కోసం తమ హెల్ప్ లైన్ నంబర్​లను సంప్రదించాలని ఆమె సూచించారు.

కరోనా సమయంలో బాధితులకు ఆక్సిజన్ కాన్సెంట్రేటర్లను తాము స్వయంగా సమకురుస్తున్నట్లు ఆమె వెల్లడించారు. ఈ సదుపాయాన్ని బాధితులు సద్వినియోగం చేసుకోవాలని ఆమె తెలియచేశారు. హెల్ప్ లైన్ నంబర్లు 7799819991, 7396786468, 8639839532, 7799657887 లను సంప్రదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో భాజపా నగర సీనియర్ నాయకులు వినయ్ కుమార్, డాక్టర్ శ్రీదేవి, ఉమేష్, తులసి, లక్ష్మణ్ యాదవ్, సాయి కుమార్, ఆనంద్ రావు, సంతోష్, భరత్ తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి: Lockdown : సాయంత్రం 5 గంటల వరకు లాక్​డౌన్ సడలింపు?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.