ETV Bharat / state

Gandhi Jayanti Telangana 2023 : 'గాంధీజీ కలగన్న గ్రామ స్వరాజ్యానికి తెలంగాణ పల్లెలు ప్రతిరూపాలు'

Gandhi Jayanti Telangana 2023 : గాంధీ జయంతిని పురస్కరించుకుని రాష్ట్రవ్యాప్తంగా నేతలు మహాత్ముడికి నివాళులర్పించారు. స్వాతంత్య్ర ఉద్యమంలో ఆయన చేసిన పోరాటాన్ని గుర్తు చేసుకున్నారు. గాంధీ సూచించిన మార్గంలోనే ప్రతిఒక్కరూ నడుచుకోవాలని సూచించారు. గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యానికి తెలంగాణ పల్లెలు ప్రతిరూపాలని సీఎం కేసీఆర్​ అన్నారు.

Gandhi Jayanti 2023 Celebrations in Sangareddy
Gandhi Jayanti 2023 in Telangana
author img

By ETV Bharat Telangana Team

Published : Oct 2, 2023, 11:59 AM IST

Updated : Oct 2, 2023, 1:02 PM IST

Gandhi Jayanti 2023 Telangana : మహాత్మా గాంధీ 154వ జయంతి(Gandhi Jayanti ) సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ప్రముఖ నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారులు మహాత్మునికి నివాళులర్పించారు. ముఖ్యమంత్రి కేసీఆర్​ గాంధీజీ చిత్రపటానికి నివాళులు అర్పించి అంజలి ఘటించారు. గాంధీ దేశానికి అందించిన సేవలు అమూల్యమైనవని కొనియాడారు. తమ ప్రభుత్వం గాంధీజీ సిద్దాంతాలకు అనుగుణంగానే పరిపాలిస్తోందని తెలిపారు. గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యానికి తెలంగాణ పల్లెలు ప్రతిరూపాలని తెలిపారు.

  • On the special occasion of Gandhi Jayanti, heartfelt tributes to Mahatma Gandhi who proved that strength lies in truth, and unity is our greatest weapon.

    Let's embrace his legacy of non-violence and kindness. #GandhiJayanthi pic.twitter.com/WcLnnin7ad

    — KTR (@KTRBRS) October 2, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

Gandhi Jayanti 2023 Celebrations in Telangana : శాసనసభా ప్రాంగణంలో సభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, మండలి ఛైర్మన్‌ గుత్తా సుఖేందర్‌, డిప్యూటీ ఛైర్మన్‌ బండ ప్రకాశ్‌లు గాంధీ విగ్రహానికి నివాళులర్పించారు. మహాత్ముడు చూపిన మార్గంలో నడుస్తూ కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నామని గుత్తా సుఖేందర్‌ రెడ్డి తెలిపారు. జాతికి మహాత్మడు చేసిన కృషి ఎనలేనిదంటూ మంత్రి కేటీఆర్(Minister KTR)​ గుర్తు చేసుకున్నారు. హైదరాబాద్‌లో గాంధీ చిత్రపటానికి పూలమాల వేసిన మంత్రి.. జాతిపిత ఆదర్శంగానే రాష్ట్రంలో పాలన సాగుతుందన్నారు.

'మహాత్ముని శాంతి సందేశం నవ శకానికి నాంది'

ఖమ్మంలో మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర మహాత్ముడికి పూలమాల వేసి అంజలి ఘటించారు. హనుమకొండలోని పబ్లిక్‌గార్డెన్‌లో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు మహాత్ముడి ఘనతను కొనియాడారు. అనంతరం ఘన నివాళులు అర్పించారు. మరోవైపు సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మహాత్మా గాంధీ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం ఆవరణలోని మహాత్ముడి విగ్రహానికి ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, బీఆర్​ఎస్​ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆర్యవైశ్య సంఘం నాయకులు పట్టణంలో ర్యాలీ నిర్వహించారు.

రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా గాంధీ జయంతి వేడుకలు

Gandhi Jayanti 2023 Celebrations in Khammam : జాతిపిత మహాత్మా గాంధీ జయంతిని ఖమ్మంలో జిల్లా ప్రముఖులు ఘనంగా నిర్వహించారు. గాంధీచౌక్‌లోని గాంధీ విగ్రహాం వద్ద నివాళులు అర్పించారు. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ గాంధీ విగ్రహానికి పూలతో నివాళులిచ్చారు. జిల్లా కలెక్టర్‌ గౌతమ్‌, మేయర్‌ నీరజ గాంధీని స్మరించుకున్నారు. జయశంకర్​ భూపాలపల్లి జిల్లాలో చేల్పూర్​ కూడలి వద్ద ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణ రెడ్డి జాతిపితకి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. అహింస మార్గంలో అన్ని వర్గాల ప్రజలను ఏకం చేసి.. భారత దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన గొప్ప వ్యక్తి మహాత్మగాంధీ అని అన్నారు. ఆయన ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆశించాలని కోరారు. గాంధీజీ స్ఫూర్తితో నేటి తరం యువత దేశ సార్వభౌమత్వానికి కృషి చేయాలని పేర్కొన్నారు.

Gandhi Jayanti 2023 : 'ప్రపంచవ్యాప్తంగా గాంధీ ప్రభావం'.. మహాత్మునికి రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ నివాళులు

మహాత్మా గాంధీకి ఘన నివాళి.. ముర్ము, మోదీ, సోనియా పుష్పాంజలి

Last Updated : Oct 2, 2023, 1:02 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.