ETV Bharat / state

Gandhi Hospital Rape: 'గాంధీలో అక్కాచెల్లెళ్లపై అత్యాచారం' కేసులో సూపరింటెండెంట్ ఆసక్తికర వ్యాఖ్యలు - gandhi news

అక్కచెళ్లెల్లపై సామూహిక అత్యాచారం ఘటనపై గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్ రాజారావు స్పందించారు. ఘటనపై విచారణ కమిటీ వేశామని తెలిపారు. ఆరోపణలు రుజువయ్యే వరకు.. అసత్య ప్రచారాలు చేయవద్దని సూచించారు.

Gandhi Superintendent‌
అసత్య ప్రచారాలు వద్దు
author img

By

Published : Aug 17, 2021, 12:40 PM IST

Updated : Aug 17, 2021, 4:18 PM IST

గాంధీ ఆస్పత్రిలో అత్యాచారం ఆరోపణలపై విచారణ కమిటీ నియమించామని సూపరింటెండెంట్‌ రాజారావు వెల్లడించారు. నిజనిజాలేంటో తెలియకుండా ఆరోపణలు చేయడం వల్ల ఆస్పత్రికి వచ్చే పేదలు భయాందోళన చెందుతారని రాజారావు అభిప్రాయపడ్డారు. గాంధీ ఆవరణలో 190 ప్లస్ సీసీ కెమెరాలు పనిచేస్తున్నాయని వెల్లడించారు.

నిన్న మధ్యాహ్నం మీడియా గ్రూప్​ ద్వారా నాకు ఈ ఘటనపై సమాచారం అందింది. దానికి ముందు నాకు ఈ విషయం గురించి తెలియనే తెలియదు. కనీసం కంప్లైంట్​ కూడా రాలేదు. వెంటనే చిలకలగూడా పోలీస్​ స్టేషన్​కు వెళ్లి ఘటనపై ఫిర్యాదు చేశాము. అనంతరం ఆస్పత్రిలో విచారణ కమిటీ వేశాము. ఆరోపణలు నిజమైతే ఎవరినైనా క్షమించేది లేదు. కానీ గాంధీలో ప్రతి ఫ్లోర్​లో పోలీసులు, భద్రతా సిబ్బంది ఉంటారు. 219 సీసీ కెమెరాలు ఉన్నాయి. వాటిలో వర్షాలు, కొన్ని టెక్నికల్​ ప్రాబ్లం కారణంగా 25 పనిచేయట్లేదు. మిగిలినవన్నీ పనిచేస్తున్నాయి.

పోలీసులతో పాటు విచారాణ కమిటీ బాధితురాలిని సీసీ కెమెరాలో గుర్తించారు. అప్పుడు ఆమె పేషంట్ల వెయింటిగ్​ హాల్​లో వేచి చూస్తుంది. ఆమెను తీసుకెళ్లినట్లు ఎలాంటి దృశ్యాలు నమోదు కాలేదు. బాధితులు చేస్తున్న ఆరోపణలు జరిగినట్లు ఇప్పటివరకు ఈ విచారణలో తెలియలేదు. ఈ ఘటనపై పోలీసు స్టేషన్​లోనే మొత్తం విచారణ జరుగుతోంది. ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి ఇప్పటివరకు ఇలాంటి పనులు చేయలేదు. ఇప్పటికి అది మాత్రమే చెప్పగలము. 24 గంటలు పోలీసులు రౌండ్స్​ వేస్తారు. సెక్యూరిటీ ఉంటుంది. సీసీ కెమెరాలు ఉన్నాయి. ఇంత భద్రత మధ్య ఆ ఆరోపణలు నిజమవ్వడానికి ఆస్కారమే లేదు. ప్రతి వార్డు ఎప్పుడూ రద్దీగా ఉంటుంది. పోలీసులు తిరుగుతూనే ఉంటారు. వాడని గదులకు లాక్​ వేస్తాం కానీ... ఇలా సామూహిక అత్యాచారం చేయడానికి ఎక్కువ ఛాన్స్​ లేదు.

దీనిపై విచారణ జరిగాక నిజనిజాలు తెలుస్తాయి. ఆరోపణలు రుజువు కాకుండా అసత్య ప్రచారాలు చేయవద్దు. ఎందుకంటే ఇక్కడకు వచ్చే పేద, మధ్య తరగతి ప్రజలకు గాంధీ ఆస్పత్రిపై నమ్మకం పోతుంది. అలాంటి ఘటనలు జరగలేదనే అనిపిస్తోంది. ఒక వేళ నిజమని తెలిస్తే.. బాధ్యులపై తప్పక కఠిన చర్యలు తీసుకుంటాం.'

-రాజారావు, గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్

ఆస్పత్రిలో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నట్లు అసత్య ప్రచారం చేస్తున్నారని రాజారావు ఆవేదన వ్యక్తం చేశారు. ఆరోపణలు రుజువు కాకుండా అసత్య ప్రచారం చేయవద్దంటూ సూచించారు. అత్యాచార ఆరోపణల నేపథ్యంలో గాంధీ ఆస్పత్రిని మహిళా కమిషన్‌ ఛైర్‌ పర్సన్ సునీతా లక్ష్మారెడ్డి సందర్శించారు. ఘటనపై సూపరింటెండెంట్‌తో చర్చించారు.

అసత్య ప్రచారాలు వద్దు

ఇదీ చూడండి: Gandhi Hospital Rape: గాంధీలో దారుణం.. అక్కాచెల్లెళ్లపై సామూహిక అత్యాచారం..!

Last Updated : Aug 17, 2021, 4:18 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.