హైదరాబాద్ గాంధీ ఆసుపత్రిలో గత 13 ఏళ్లుగా పొరుగుసేవల (ఔట్‌సోర్సింగ్) పద్ధతిలో విధులు నిర్వహిస్తున్న స్టాఫ్ నర్సులు బుధవారం నుంచి సమ్మెకు వెళ్లనున్నారు. తమ డిమాండ్లను నెరవేర్చాలంటూ మంగళవారం ఆసుపత్రి సూపరింటెండెంట్ శ్రావణ్‌కుమార్‌కు సమ్మె నోటీసును అందజేశారు. ఆసుపత్రిలో ఔట్‌సోర్సింగ్ నర్సులు 200 మంది ఉన్నారు. గాంధీలో అధికారికంగా 1050 పడకలకు 350 మంది నర్సులు ఉండాల్సి ఉన్నా.. ప్రస్తుతం 160 మంది పనిచేస్తున్నారు.
2008 నుంచి కొత్తగా నియామకాలు చేపట్టకపోవడంతో 200 మంది స్టాఫ్ నర్సులను ఔట్ సోర్సింగ్ పద్ధతిలో తీసుకున్నారు. దీంతో వారిపైనే అధికంగా ఆధారపడుతున్నారు. ప్రస్తుతం కరోనా విజృంభిస్తున్న సమయంలో నర్సులు సమ్మె ప్రకటించడంతో ఆసుపత్రి వర్గాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.
ఇవీ చూడండి: రాష్ట్రంలో 644కు చేరిన కరోనా కేసులు