ETV Bharat / state

విష్ణువర్ధన్​ రెడ్డిని దూరం పెట్టడం.. కాంగ్రెస్​కు సరికాదు : గద్దర్

కాంగ్రెస్​ పార్టీ కోసం, ప్రజల కోసం జీవితాన్ని త్యాగం చేసిన గొప్ప వ్యక్తిగా, ప్రజల మనిషిగా పీజేఆర్​ చరిత్రలో నిలిచిపోయారని, అలాంటి గొప్ప నాయకుడి కొడుకుని, ప్రజాక్షేత్రంలో ఎమ్మెల్యేగా గెలిచిన నాయకుడిని కాంగ్రెస్​ పార్టీ పక్కకు పెట్టడం సరికాదని ప్రజా గాయకుడు గద్దర్​ అన్నారు. హైదరాబాద్​ దోమలగూడలోని విష్ణువర్ధన్​ రెడ్డి నివాసంలో గద్దర్ ఆయనను మర్యాద పూర్వకంగా కలిశారు.

Gaddar Meets Ex Congress MLA Vishnuvardhan Reddy
విష్ణువర్ధన్​ రెడ్డిని దూరం పెట్టడం.. కాంగ్రెస్​కు సరికాదు : గద్దర్
author img

By

Published : Aug 21, 2020, 8:23 PM IST

తెలంగాణ ప్రజల్లో పీజేఆర్​ చిరస్థాయిగా నిలిచిపోయే నేత అని.. కాంగ్రెస్​ పార్టీ కోసం, ప్రజల కోసం నిరంతరం పనిచేసిన నేత పీజేఆర్​ అని ప్రజా నాయకుడు గద్దర్​ అన్నారు. జనార్ధన్​రెడ్డిలాంటి గొప్ప నాయకుడి కొడుకును కాంగ్రెస్​ పార్టీ దూరం పెట్టడం సరికాదన్నారు. హైదరాబాద్​​ దోమలగూడలోని మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్​ నివాసంలో గద్దర్​ శాసనసభ్యుడు విష్ణువర్ధన్​ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిశారు. పీజేఆర్​ వ్యక్తిత్వాన్ని, త్యాగాన్ని గద్దర్​ గుర్తు చేసుకున్నారు.

విష్ణువర్ధన్​ రెడ్డి కూతురుతో గద్దర్​ ముచ్చటించారు. పీజేఆర్​తో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. దివంగత పీజేఆర్​ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. విష్ణువర్ధన్ రెడ్డితో గద్దర్​ కొద్దిసేపు రాజకీయాల గురించి మంతనాలు జరిపారు. కాంగ్రెస్ పార్టీ విష్ణువర్ధన్​ రెడ్డిని నిర్లక్ష్యం చేసిందని, ఆయనను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అవసరమైతే సోనియా కాంగ్రెస్ పేరుతో పార్టీ ఏర్పాటు చేయాలని విష్ణువర్ధన్ రెడ్డికి గద్దర్ సూచించారు. కాంగ్రెస్ పార్టీలో పీజేఆర్ వంటి నాయకుడిని, ఆయన తనయుడు విష్ణువర్ధన్ రెడ్డిని ఎవరు వేలెత్తి చూపించలేరని గద్దర్​ అభిప్రాయపడ్డారు.

ఇదీ చూడండి: నాగార్జునసాగర్​ 4 క్రస్ట్​ గేట్లు ఎత్తిన అధికారులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.