హైదరాబాద్ గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది.భార్య,కుమారుడిని హత్య చేసిన కసాయి భర్త...అనంతరం తాను కూడా కరెంట్ వైర్‌ను పట్టుకుని ఆత్మహత్యాయత్నంకు పాల్పడ్డాడు.
కర్ణాటక రాష్ట్రం గుల్బర్గాకు చెందిన అనంతప్ప అలియాస్ చిన్నా(30), భార్య మహాదేవమ్మా (25),కూతురు అర్చన (3), కుమారుడు ఆకాశ్ (2) తో కలిసి గచ్చిబౌలి ఎన్టీఆర్ నగర్లో నివాసం ఉంటున్నాడు. ఆటో డ్రైవర్‌గా జీవనం సాగిస్తున్న అనంతప్ప ఇవాళ ఉదయం భార్య ,కుమారుడిని గొంతు నులిమి హత్య చేశాడు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకొన్న పోలీసులు మృతదేహాలను ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు గచ్చిబౌలి సీఐ శ్రీనివాస్ తెలిపారు.
ఇవీ చూడండి:నేడు రాష్ట్ర మంత్రివర్గం కీలక సమావేశం