లాక్ డౌన్ దృష్ట్యా ఏపీలో ఇంటింటికీ పండ్లు, కూరగాయలు సరఫరా చేసేందుకు సిద్ధమైనట్లు ప్రముఖ ఆహార సరఫరా సంస్థ స్విగ్గీ తెలిపింది. తాజా కూరగాయలు, పండ్లను డోర్ డెలివరీ చేయనున్నట్లుగా స్విగ్గీ తన ట్విట్టర్ ఖాతాలో తెలిపింది. ఆ రాష్ట్ర మార్కెటింగ్ శాఖ భాగస్వామ్యంతో ఈ సేవలను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు వెల్లడించింది. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాకుండా చేసేందుకు ఈ సేవలు అందించనున్నట్లు వివరించింది. ఇలాంటి సమయంలో తమకు అవకాశం ఇచ్చినందుకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ధన్యవాదాలు తెలుపుతున్నామని స్విగ్గీ... ట్విట్టర్లో తెలిపింది.
ఇదీచదవండి