డా.మాదిరెడ్డి మల్లారెడ్డి దేవరకొండ జ్ఞాపకార్థం నాగోల్ అల్కాపురి నక్షత్ర ఆసుపత్రిలో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. కార్యక్రమంలో ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి, కార్పొరేటర్ రాధాతో కలిసి శిబిరాన్ని ప్రారంభించారు. శిబిరం ఏర్పాటు చేసి ప్రజలకు అన్ని రకాల వైద్య పరీక్షలను.. అతి తక్కువ ధరకే అందించామని వైద్యులు తెలిపారు. ప్రస్తుత రోజుల్లో ప్రతీ ఒక్కరికీ బీపీ, షుగర్ , మోకాళ్ళ నొప్పులు, ఆలోచనతో ఆరోగ్య సమస్యలు చుట్టుముడుతున్నాయని అన్నారు.
ఆరోగ్య సమస్యల తీవ్రత ఎక్కువయ్యే వరకు మనకు తెలియదని, కాబట్టి ఈ ఉచిత వైద్య శిబిరాన్ని వినియోగించుకోవాలని అన్నారు. అన్ని రకాల ప్రముఖ వైద్య నిపుణులతో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయడం అభినందనీయమని ఆయన అన్నారు. పేద ప్రజలకు న్యాయమైన వైద్యం అందించాలనే లక్ష్యంతోనే ఈ ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేసినట్లు ఆసుపత్రి యాజమాన్యం వెల్లడించింది.