ETV Bharat / state

మొగుళ్లపల్లి యువసేన దాతృత్వం: పేద జంటకు ఉచితంగా వైభవంగా పెళ్లి - దిల్​సుఖ్​నగర్​లో పేద జంటకు ఉచిత వివాహం

నా అనేవారు లేని.. పెళ్లి ఖర్చులకు స్తోమతలేని నిరుపేద జంటలకు మొగుళ్లపల్లి యువసేన ఉచితంగా వివాహాలు జరిపిస్తున్నారు. హైదరాబాద్‌ దిల్‌సుఖ్​నగర్‌లోని శ్రీ సత్యనారాయణ స్వామి ఆలయంలో ఓ పేద జంటకు వైభవంగా పెళ్లి చేశారు.

free marriage to the poor couple in the presence of mogullapally yuvasena at hyderabad dilshukh nagar
మొగుళ్లపల్లి యువసేన దాతృత్వం.. పేద జంటకు వైభవంగా ఉచిత పెళ్లి
author img

By

Published : Jul 23, 2020, 5:47 PM IST

హైదరాబాద్​ దిల్​సుఖ్​నగర్​లోని శ్రీ సత్యనారాయణ స్వామి ఆలయంలో మొగుళ్లపల్లి యువసేన ఆధ్వర్యంలో ఓ పేద జంటకు ఉచితంగా వివాహం జరిపించారు. వధూవరులు జగదీశ్​, ప్రసన్న జంటకు మొగుళ్లపల్లి ఉపేందర్‌ గుప్తా వైభవంగా పెళ్లి చేశారు. దీనితో కలిపి ఇప్పటి వరకు 183 ఉచిత వివాహాలు జరిపించినట్టు ఉపేందర్ గుప్తా తెలిపారు. కొవిడ్ -19 నిబంధనలను పాటిస్తూ మాస్కులు పెట్టుకుని భౌతిక దూరం పాటిస్తూ ఈ కార్యక్రమం జరిపించామని వారు వెల్లిడించారు. ఉపేందర్​ పెద్ద మనస్సుకి నూతన వధూవరులు కృతజ్ఞతలు తెలిపారు.

ఇవీ చూడండి: వ్యవసాయ శాఖ క్రియాశీలకంగా మారాలి: సీఎం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.