ETV Bharat / state

జీహెచ్​ఎంసీలో మరో వంద అన్నపూర్ణ కేంద్రాలు..

లాక్​డౌన్ వేళ ఎవరూ ఆకలితో అలమటించకూడదనే ఉద్దేశంతో... హైదరాబాద్​లో మరో వంద అన్నపూర్ణ కేంద్రాలు ఏర్పాటు చేయాలని మంత్రి కేటీఆర్ ఆదేశించారు. ప్రస్తుతం 150 అన్నపూర్ణ కేంద్రాలు ఉన్నాయి. గురువారం 59వేల మందికి ఆహారం అందజేసినట్లు అధికారులు వెల్లడించారు.

free food distribution in hyderabad, annapurna food canteens
హైదరాబాద్​లో ఉచిత భోజనం, అన్నపూర్ణ ఆహార కేంద్రాలు
author img

By

Published : May 21, 2021, 9:15 AM IST

Updated : May 21, 2021, 9:32 AM IST

లాక్‌డౌన్‌ నేపథ్యంలో హైదరాబాద్ నగరంలోని నిరాశ్రయులు, నిరుపేదలకు జీహెచ్‌ఎంసీ అన్నపూర్ణ కేంద్రాల ద్వారా భోజం అందిస్తోంది. రూ.5 భోజనాన్ని ఉచితంగా అందజేయడంతోపాటు మరో వంద కేంద్రాలను అదనంగా ఏర్పాటు చేయాలని అధికారులను మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఆదేశించారు. ప్రస్తుతం 150 అన్నపూర్ణ కేంద్రాలతో పాటు మరో 100 అందుబాటులోకి వచ్చాయి. నగరంలో గురువారం 59వేల మంది ఆకలి తీర్చినట్లు అధికారులు వెల్లడించారు.

సర్కిల్​కు ఒక్కటి చొప్పున ప్రత్యేక కేంద్రం ఏర్పాటు చేసి వీధుల్లో తలదాచుకునే వారికి సంబంధిత ఏఎంహెచ్​వో ఆధ్వర్యంలో అందజేస్తున్నారు. రోజూ ఉదయం, సాయంత్రం వేళల్లో భోజనాలను అందిస్తున్నారు. రోజుకు కనీసం 45 వేల మందికి ఆహారం అందించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించినప్పటికీ... 59,010 మంది ఆకలి చల్లార్చినట్లు అధికారులు తెలిపారు.

నగరంలోని ప్రధాన ఆస్పత్రులైన గాంధీ, ఉస్మానియా, నిమ్స్, కింగ్ కోఠి, టిమ్స్ తదితర కేంద్రాల వద్ద అదనపు కౌంటర్లను ఏర్పాటు చేసి అందరికీ భోజనాలను అందిస్తున్నారు. 450 గ్రాముల అన్నం, 100 గ్రాముల పప్పు, సాంబార్, పచ్చడి తప్పని సరిగా ఉండే విధంగా మెనూను అమలు చేస్తున్నామన్నారు.

ఇదీ చదవండి: నేడు వరంగల్​ ఎంజీఎంకు ముఖ్యమంత్రి కేసీఆర్​

Last Updated : May 21, 2021, 9:32 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.