ఇప్పటికే పలు అంతర్జాతీయ వేదికలు, దేశాల నుంచి ఆహ్వానం అందుకున్న మంత్రి కేటీఆర్‌కు మరో ప్రతిష్ఠాత్మక ఆహ్వానం దక్కింది. తమ సెనెట్‌లో ఏర్పాటు చేసే సదస్సులో ప్రసంగించాల్సిందిగా ఫ్రెంచ్ ప్రభుత్వం కేటీఆర్‌కు ఆహ్వానం పంపింది. ఈనెల 29న జరిగే ఆంబిషన్ ఇండియా బిజినెస్ ఫోరం (ambition india business forum meet 2021) సమావేశంలో ప్రత్యక్షంగా పాల్గొని ప్రసంగించాల్సిగా విజ్ఞప్తి చేసింది.
కీనోట్ స్వీకర్‌గా..
ఫ్రెంచ్ ప్రధాన మంత్రి సారథ్యంలో ఏర్పాటయిన ఈ సదస్సు భారత్ - ఫ్రెంచ్ దేశాల మధ్య వ్యాపార, వాణిజ్య, పెట్టుబడి సంబంధాల బలోపేతానికి దోహదం చేస్తుందని.. ఫ్రెంచ్ ప్రభుత్వం మంత్రి కేటీఆర్‌కు పంపిన లేఖలో పేర్కొంది. ఆంబిషన్ ఇండియా 2021 సదస్సులో(ambition india business forum meet 2021) 'కీనోట్ స్పీకర్'గా పాల్గొని 'గ్రోత్-డ్రాఫ్టింగ్ ఫ్యూచర్ ఆఫ్ ఇండో ఫ్రెంచ్ రిలేషన్స్ ఇన్ పోస్ట్ కోవిడ్ ఎరా' అనే అంశంపైన తన అభిప్రాయాలు పంచుకోవాలని మంత్రి కేటీఆర్‌ని (france invites minister ktr) ఆహ్వానించింది.
కీలకమైన వేదికపై..
గతంలో నిర్వహించిన ఆంబిషన్ ఇండియా సదస్సులో సుమారు 700 మంది వ్యాపార, వాణిజ్య భాగస్వాములు, 400కు పైగా ఇరు దేశాల కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారని లేఖలో పేర్కొంది. ఈసారి అంతకుమించి కంపెనీల భాగస్వామ్యాన్ని ఆశిస్తున్నామని, ఇలాంటి కీలకమైన వేదిక తెలంగాణలో ఉన్న వ్యాపార వాణిజ్య అవకాశాలను పరిచయం చేసేందుకు ఉపయుక్తంగా ఉంటుందని మంత్రి కేటీఆర్‌కు పంపిన లేఖలో ఫ్రెంచ్ ప్రభుత్వం (france invites minister ktr)పేర్కొంది.
ముఖ్యంగా ఈ సదస్సులో హెల్త్‌కేర్, క్లైమేట్ చేంజ్, డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్, ఆగ్రో బిజినెస్ వంటి ప్రధానమైన అంశాలపైన ప్రత్యేక సమావేశాలను ఈ సదస్సులో భాగంగా ఏర్పాటు చేశామని ఫ్రెంచ్ ప్రభుత్వం కేటీఆర్‌కు పంపిన లేఖలో పేర్కొంది. దీంతో పాటు ఫ్రెంచ్, భారత కంపెనీల మధ్య ద్వైపాక్షిక సమావేశాలు ఉంటాయని తెలిపింది.
కేటీఆర్ హర్షం..
ఈ ఆహ్వానం పట్ల హర్షం వ్యక్తం చేసిన మంత్రి కేటీఆర్.. ఈ సదస్సు ద్వారా తెలంగాణలో ఉన్న పెట్టుబడి అవకాశాలను పరిచయం చేసే అవకాశం కలుగుతుందని చెప్పారు. ఫ్రెంచ్ ఆహ్వానం తెలంగాణ ప్రభుత్వ విధానాలకు దక్కిన గుర్తింపుగా భావిస్తున్నానని వెల్లడించారు.
ఇదీచూడండి: KTR: తెరాస అధ్యక్షుడి ఎన్నికకు షెడ్యూల్.. కేటీఆర్ ఏమన్నారంటే...