హైదరాబాద్ అంబర్పేట డీడీ కాలనీలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. తొమ్మిది రోజుల వ్యవధిలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృత్యువాత పడ్డారు.
తల్లిదండ్రుల అకాల మరణం తట్టుకోలేని వారి కుమార్తె, కుమారుడు నిఖిల్ కర్బందా, మన్ను కర్బందా ఈనెల 11న శీతల పానీయంలో నిద్రమాత్రలు కలుపుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఇది గమనించిన స్థానికులు గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఆరోగ్యం విషమించి ఈనెల 15న నిఖిల్ మరణించగా.. మృత్యువుతో పోరాడి మన్ను కర్బందా నిన్న సాయంత్రం మూడు గంటలకు తుదిశ్వాస విడిచింది. కేవలం తొమ్మిది రోజుల వ్యవధిలోనే కుటుంబ సభ్యులంతా మరణించడం వల్ల అంబర్పేట డీడీ కాలనీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. బంసిలాల్పేట స్మశానవాటికలో మన్ను అంత్యక్రియలు నిర్వహించారు.
ఇవీచూడండి: భార్యపిల్లలను వేధించాడు... ఉరేసుకున్నాడు