వ్యవసాయ రంగం, రైతుల ప్రయోజనాలకు విఘాతతం కలిగించే సాగు చట్టాలు రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ.. అఖిలపక్ష రైతు సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన జరిగింది. దేశంలో మూడు వ్యవసాయ చట్టాలు తీసుకువచ్చి.. ఏడాదైన సందర్భంగా అఖిల భారత రైతు పోరాట సమన్వయ కమిటీ పిలుపు మేరకు హైదరాబాద్ ఆదాయ పన్ను శాఖ కార్యాలయం ఎదుట రైతులు ధర్నా చేపట్టారు.
కార్పొరేట్ ప్రైవేటు సంస్థల చేతుల్లో కీలక వ్యవసాయ రంగాన్ని తాకట్టు పెట్టే ఈ నల్ల చట్టాలకు ఏడాది పూర్తి అయిన సందర్భంగా గెజిట్ ప్రజలు చింపి.. రైతు సంఘాలు తమ నిరసన వ్యక్తం చేశాయి. గతేడాదిగా రైతులు పెద్ద ఎత్తున శాంతియుతంగా ఆందోళనలు చేస్తున్నా.. కేంద్రం స్పందించకపోవడం దారుణమని అన్నారు. తక్షణమే మోదీ సర్కారు ఈ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే.. ఉద్యమం ఉద్ధృత స్థాయికి చేరుకుంటుందని హెచ్చరించారు.