కులాలు, మతాలు, ప్రాంతాల వారీగా ఓట్లు సంపాదించుకోవాలని ప్రధాని మోదీ చూస్తున్నారని పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య ఆరోపించారు. ఎన్నికల కోసమే గత ప్రభుత్వాలు బడ్జెట్ ప్రవేశపెట్టేవని ప్రధాని చేసిన వ్యాఖ్యలు బాధాకరమన్నారు. బిహార్ ఎన్నికలకు ముందు ఐదు లక్షల కోట్ల ప్యాకేజీని ప్రకటించ లేదా అని ప్రశ్నించారు.
గత 70 రోజులుగా దిల్లీ సరిహద్దుల్లో రైతులు.. నిరసన చేస్తున్నా ప్రధాని స్పందించడం లేదన్నారు. 175 మంది రైతులు ప్రాణాలు కోల్పోయినా పట్టించుకోలేదని విమర్శించారు. విశాఖ ఉక్కు తెలుగు వాళ్ల హక్కు అంటూ అప్పుడు కోట్లాడాం... ఇప్పుడేమో ప్రధాని తమ వాళ్ల కోసం దానిని అమ్ముతున్నారని చెప్పారు.
ఇదీ చదవండి: 'రేపటి నుంచి పోలీస్, రెవెన్యూ సిబ్బందికి వ్యాక్సినేషన్'