కరోనాను నియంత్రించడంలో.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని మాజీ ఎంపీ, కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ మండిపడ్డారు. ఒక్క రోజులో ఆక్సిజన్‌ను తయారు చేసి సరఫరా చేస్తామని అనడం.. వట్టి బూటకమని పేర్కొన్నారు. మహమ్మారి అంతమవ్వాలని కోరుతూ.. అంబర్‌పేట మహంకాళి ఆలయంలో చేపట్టిన చండీ యాగం మూడో రోజు ఘనంగా ముగిసింది.
మహమ్మారి నుంచి ప్రజలకు విముక్తి కల్పించాలని కోరుతూ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. కొవిడ్ బారిన పడ్డ రాహుల్ గాంధీ, మన్మోహన్ సింగ్ త్వరగా కోలుకోవాలని ప్రార్థించినట్లు ఆయన చెప్పారు. ప్రభుత్వాలు.. ఎన్నికలకు ఇచ్చినంత సమయాన్ని, కరోనా నియంత్రణకు ఇవ్వడం లేదంటూ వీహెచ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి సంబానీ చంద్రశేఖర్ రావు, పీసీసీ జనరల్ సెక్రటరీ మహేశ్ గౌడ్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రెసిడెంట్ కొమురయ్య పాల్గొన్నారు.
ఇదీ చదవండి: లాక్డౌన్ విధింపుపై కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు