చమురు ధరల పెరుగుదలను నిరసిస్తూ మాజీ ఎంపీ హర్ష కుమార్ రాజమహేంద్రవరంలో వినూత్నంగా నిరసన తెలిపారు. తన నివాసం నుంచి రాజీవ్ గాంధీ విద్యాసంస్థల వరకు ఒంటెపై ప్రయాణించారు. ప్రధాని మోదీ దేశాన్ని 50 ఏళ్లు వెనక్కి నెట్టారని విమర్శించారు. త్వరలో కాంగ్రెస్ పాలన రాబోతుందని, ప్రజలు కూడా అదే కోరుకుంటున్నారన్నారు.
ఇదీ చదవండి: నేటి నుంచే 6,7, 8 తరగతులు.. తల్లిదండ్రుల అనుమతి తప్పనిసరి