పదవీలో ఉన్నప్పటికంటే.. లేనప్పుడే ప్రజలకు ఎక్కువ సేవ చేసే అవకాశం వస్తోందని మాజీ ఎంపీ బూర నర్సయ్య అన్నారు. హైదరాబాద్‌లోని హైదర్‌గూడలో.. ఆయన జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. పలువురు తెరాస పార్టీ నేతలు ఈ కార్యక్రమానికి హాజరై.. తమ ప్రియతమ నాయకుడికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
ఉద్యమంలో సీఎం కేసీఆర్‌తో కలిసి పని చేసినందుకు.. పార్టీలో తనకు సముచిత స్థానాన్ని కల్పించారని బూర గుర్తు చేశారు. యువత తమ కాళ్లపై తాము నిలిచినప్పుడే.. రాష్ట్రం, దేశం అభివృద్ధి పథంలో దూసుకెళ్తుందన్నారు.
ఇదీ చదవండి: 'నిరుద్యోగం పెరగడానికి నోట్ల రద్దే కారణం'