తెరాస పాలనలో పోలీస్, రెవెన్యూ వ్యవస్థని వాడుకుని ప్రజలను గ్రామాల నుంచి వెళ్లగొట్టారని... కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య అన్నారు. సిద్దిపేట జిల్లా వేములఘాట్‌లో మల్లారెడ్డి అనే రైతు చితి పేర్చుకుని సజీవ దహనం చేసుకోవడం బాధాకరమని విచారణ వ్యక్తం చేశారు. ఆయన మృతికి సీఎం కేసీఆర్ బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.
ఉమ్మడి రాష్ట్రంలో ఏ ఒక్క రైతు న్యాయస్థానానికి వెళ్లకుండా ప్రాజెక్టులు నిర్మించిన ఘనత కాంగ్రెస్‌కే దక్కుతుందని తెలిపారు. ప్రజల క్షేమం విషయంలో అందరికంటే ముందు వరుసలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ ఉన్నారని పేర్కొన్నారు. కరోనా సంక్షోభం రాబోతుందని ఆయన ముందే చెప్పారన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తంగా ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదన్నారు.
ఇదీ చదవండి: LOCKDOWN: తెలంగాణ అన్‌లాక్.. లాక్డౌన్ క్లోజ్