భాజపా, తెరాస ప్రభుత్వాలు ఉద్యోగులకు ఇచ్చిన హామీలు నెరవేర్చటం లేదని మాజీ మంత్రి చిన్నారెడ్డి ఆరోపించారు. కంట్రిబ్యూషనరీ పెన్షన్ స్కీంను తెచ్చింది భాజపా ప్రభుత్వమేనన్నారు. దీని వల్ల లక్షా ముప్పై వేల మంది ఉద్యోగులు ఇబ్బంది పడుతున్నారని పేర్కొన్నారు. కొన్ని రాష్ట్రాలు దీన్ని అమలు చేయడం లేదని తెలిపారు.
పాత పెన్షన్ విధానాన్నే కొనసాగించాలని ఉద్యోగులు కోరుతున్నా... ముఖ్యమంత్రి కేసీఆర్ పట్టించుకోవటం లేదని చిన్నారెడ్డి ఆరోపించారు. కేంద్రం డీఏ పెంపును అమలు చేయడం లేదని... రాష్ట్ర ప్రభుత్వం 30నెలలుగా పీఆర్సీ పెంచటంలేదన్నారు. గతంలో కంటే ఎక్కువ పీఆర్సీ ప్రకటించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఉద్యోగుల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు.
ఇదీ చదవండి: నగరంలో కొత్త బొటిక్... హొయలొలికించిన మోడల్స్