Foreign Thieves In Hyderabad : విదేశీ ముఠాలు నగరంలోకి చొరబడ్డాయి. మీరు విన్నది నిజమే.. విదేశీ గ్యాంగ్‌లు హైదరాబాద్‌పై కన్నేశాయి. ఇప్పటి వరకు అంతర్రాష్ట్ర ముఠాలు మాత్రమే రాజధానిలో చోరీలకు పాల్పడేవారు. కానీ ఇప్పుడు పర్యాటకుల ముసుగులో విమానాల్లో వచ్చి విదేశీయులు కూడా చోరీలు చేస్తున్నారు. ఆ తర్వాత ఎంచక్కా దేశం విడిచి వెళ్లిపోతున్నారు. ఈ దొంగల ముఠాలు దేశాల హద్దులను చెరిపేస్తున్నాయి. రెండేళ్ల క్రితం ఐవరీకోస్ట్ నుంచి జాన్ గుయే రోస్టాండ్ బిజినెస్ వీసాపై ఇండియాకు వచ్చాడు. కరెన్సీ నోట్లను రెట్టింపు చేస్తానంటూ నమ్మించి.. ఈ నెలలో మాదాపూర్‌కు చెందిన వ్యాపారి నుంచి రూ.25 లక్షలు కొల్లగొట్టాడు. దీంతో మోసపోయానని గ్రహించిన.. బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. దీంతో ఆ విదేశీయుడిపై పోలీసులు నిఘా ఉంచితే.. ఎల్బీనగర్లో మరో మోసానికి పాల్పడుతున్నాడనే సమాచారంతో రాచకొండ పోలీసులు పక్కా సమాచారంతో పట్టుకున్నారు.
Foreign Thieves Gang Robbing Hyderabad In Guise Of Tourists : కొవిడ్ అనంతర పరిస్థితులతో అనేక దేశాల్లో ఉపాధి, ఉద్యోగ అవకాశాలు గణనీయంగా తగ్గిపోయాయి. ఆర్థిక పరిస్థితులు ఎదురవడంతో పర్యాటకులుగా వచ్చి వివిధ దేశాల్లో ఆర్థిక మోసాలకు పాల్పడుతున్నారు. రోబరీ చేయడానికి ముందు.. ఏ దేశంలో తేలిగ్గా వీసా అనేది లభిస్తుందో ఎంపిక చేసుకుంటారు. భారత్‌లో అయితే పర్యాటక వీసా తేలిగ్గా లభిస్తుండటంతో.. ఏయే నగరాల్లో చోరీలు చేయాలో ముందుగానే ఎంపిక చేసుకుంటారు.
ముంబయి, దిల్లీ, హైదరాబాద్‌లకు వచ్చి రెండు, మూడు రోజులు రెక్కీ నిర్వహించి.. సొత్తును మొత్తం కొల్లగొట్టేస్తున్నారు. తీరా పోలీసులు కనిపెట్టే లోపు దర్జాగా స్వదేశానికి వెళ్లిపోతున్నారు. వీరు ఇతరులను దృష్టి మళ్లిస్తూ డబ్బు కాజేయడం.. డాలర్ల మార్పిడి పేరుతో మోసాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు.
పోలీసులకు సవాల్ విసురుతున్న పర్యాటక దొంగలు : పర్యాటక వీసాల్లో వచ్చిన నిందితులను గుర్తించడం పోలీసులకు తలకు మించిన భారమే అవుతోందని దర్యాప్తు చేస్తున్న అధికారులు తెలుపుతున్నారు. ఎందుకంటే నిందితుల ఆచూకీ పోలీసుల రికార్డుల్లో ఉండవు, వేలి ముద్రలు, సెల్‌ఫోన్ సిగ్నల్ ఆధారంగా ఆచూకీ చిక్కడం లేదని అధికారులు వాపోతున్నారు. దీనితో కేసు దర్యాప్తులో ముందుకు సాగడం లేదు.. అలాగే దొంగలించిన సొత్తును రికవరీ చేయడం దాదాపు అసాధ్యమే అవుతుందని తెలుపుతున్నారు. దీనికి ప్రత్యేక సాక్ష్యం ఏమిటంటే.. ఈ ఏడాది మేలో కూకట్‌పల్లిలో బంగ్లాదేశ్ ముఠా మోసమే.. ఇందుకు నిదర్శనంగా చెప్పవచ్చు. ఫిబ్రవరిలో రూ.8 లక్షలు కాజేసినట్లు ఫిర్యాదు అందగా.. వారు బంగ్లాదేశీయులని గుర్తించేందుకు మూడు నెలల సమయం పట్టింది. అప్పటికే వారు దేశం విడిచి పోయారని పోలీసులు గుర్తించారు.
ఇవీ చదవండి :