బాల్యం నాటి తీపి గుర్తులను వెతుకుంటూ ఏకంగా దేశాలు దాటి వచ్చింది ఓ జంట. ఎప్పుడో ఆరు దశాబ్దాల క్రితం తమ తల్లిదండ్రులతో మాచ్‌ఖండ్ విద్యుత్ కేంద్రం వద్ద గడిపిన వారు ... మళ్లీ ఇన్నాళ్లకు ఆ ప్రాంతానికి వచ్చారు. ఇంగ్లాండ్‌కు చెందిన రిచార్డ్ గార్డ్, జెన్నిఫర్ గార్డ్ దంపతులు ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖ జిల్లాలోని మాచ్‌ఖండ్ జలవిద్యుత్ కేంద్రానికి ఆదివారం వచ్చారు. వీరివురి తల్లిదండ్రులు 1950 నుంచి 1952 వరకు విద్యుత్ కేంద్రం నిర్మాణ సమయంలో సొరంగాలలో పని చేశారు. వీరు బాల్యంలో రెండేళ్లు ఈ ప్రాంతంలోనే గడిపారు. అనంతరం దేశాన్ని వీడి ఇంగ్లాండ్‌లో స్థిరపడ్డారు. ఒకప్పుడు స్నేహితులైన రిచార్డ్ గార్డ్, జెన్నిఫర్ గార్డ్లు భార్యాభర్తలుగా మారారు. అప్పుడు వెళ్లిపోయిన వీరు మళ్లీ ఇన్నేళ్ల తరువాత మాచ్‌ఖండ్ ప్రాజెక్ట్ సందర్శించి వారి చిన్ననాటి మధుర స్మృతులను స్థానికులతో పంచుకున్నారు. కాసేపు ఆ ప్రాంతంలో ఆనందంగా గడిపారు.
ఇదీచూడండి.'కాలుష్య పోరు'లో ప్రపంచం నుంచి భారత్ నేర్చుకోవాల్సింది?