ETV Bharat / state

గెలుపు కోసం.. పార్టీల అలుపెరగని పోరాటం..!

author img

By

Published : Feb 12, 2020, 4:59 AM IST

తెలంగాణ రాష్ట్రంలో సహకార ఎన్నికల కోలాహలం కొనసాగుతోంది. నామినేషన్లు, పరిశీలన పర్వం ముగిసిన నేపథ్యంలో.. 904 ప్రాధమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలకుగాను ఇప్పటికే 156 సొసైటీల ఎన్నిక ఏకగ్రీవమైంది. మొత్తం 11వేల 564 వార్డుల్లో.. 46 శాతం వార్డులు సైతం ఏకగ్రీవమయ్యాయి. అందుకు మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు, నేతల మంత్రాంగమే కారణం. ఈ ఎన్నికలు రాజకీయాలకు అతీతం కావడం.. అవన్నీ అధికార తెరాస మద్ధతుదారులే కైవసం చేసుకోవడం విశేషం.

for-the-victory-the-unstoppable-struggle-of-the-parties
గెలుపు కోసం.. పార్టీల అలుపెరగని పోరాటం..!

రాష్ట్రంలో ప్రాధమిక వ్యవసాయ సహకార సంఘాల ఎన్నికలు తుది అంకానికి చేరాయి. నామినేషన్లు, పరిశీలన ఘట్టం ముగియడం వల్ల పోలింగ్‌కు మరో మూడు రోజులే గడువు మిగిలి ఉంది. చివరి క్షణంలో గెలుపుకోసం రాజకీయ పార్టీల నేతలు సర్వశక్తులు ఒడ్డుతున్నారు. ఇందులో భాగంగా అవకాశం ఉన్న చోట వీలును బట్టి సాధ్యమైనన్ని ఎక్కువ సంఘాలు, వార్డులు ఏకగ్రీవ ఎన్నికలు జరిగేలా చూశారు.

ఫలించిన.. మంత్రుల మంత్రాంగం..!

మొత్తం వార్డులు 11వేల 564లో ఏకంగా 46 శాతం..అంటే 5వేల387 డైరెక్టర్లు ఏకగ్రీవంగా అయ్యాయి. అధికార పార్టీకి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతల మంత్రాంగమే దీనికి కారణం. ఇవన్నీ కూడా అధికార తెరాస మద్ధతుదారులే కైవసం చేసుకున్నారు. మొత్తం 904 సహకార సంఘాలకుగాను 156 సొసైటీల్లో అన్ని వార్డుల పదవులు ఏకగ్రీవ ఎన్నికలు జరిగాయి.

ఏకగ్రీవాలన్నీ.. తెరాసకే సొంతం

ఈ 156లో ఇక కేవలం ఛైర్మన్ ఎన్నికలే లాంఛనంగా జరగాల్సి ఉంది. మొత్తం 34వేల 108 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయగా.. వీరిలో 14వేల266 మంది ఉపసంహరించుకున్నారు. మిగిలిన 6వేల267 వార్డులకు 14వేల529 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. వీరిని గెలిపించేందుకు అన్ని పార్టీల నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రధానంగా ఇప్పటి వరకు జరిగిన ఏకగ్రీవాలన్నీ తెరాస మద్ధతుదారులే ఉన్నందున ఈ నెల 15న జరిగే పోలింగ్‌లోనూ తమ వారినే నెగ్గించుకునేందుకు ఆయా జిల్లాల మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు గట్టి ప్రయత్నం చేస్తున్నారు.

"తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం అనంతరం తొలిసారి ప్రాధమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలకు ఎన్నికలు జరుగుతున్న దృష్ట్యా... ప్రతి సొసైటీ గెలుపు కోసం గట్టి ప్రయత్నం జరుగుతోంది. అత్యధికంగా ఖమ్మం జిల్లాలో 97 సహకార సంఘాలకుగాను 36 సొసైటీలు పూర్తిగా ఏకగ్రీవమయ్యాయి. ఒక జిల్లాలో ఇన్ని సంఘాలు పూర్తిగా ఏకగ్రీవం కావడం రికార్డుగా అధికార వర్గాలు పేర్కొంటున్నాయి"

సంఘాలకు ఛైర్మన్ల ఎంపిక జరిగే విధానం:

  1. మొత్తం 904 సంఘాల్లో 19 లక్షల మంది రైతులు ఓటర్లుగా ఉన్నారు. ఫ్యాక్స్‌కు ఎన్నికైన వార్డు డైరెక్టర్ల నుంచే సంఘాలకు ఛైర్మన్లుగా ఎన్నికవుతారు.
  2. ఈ ఛైర్మన్ల నుంచే జిల్లా కేంద్ర సహకార బ్యాంకు - డీసీసీబీ, కేంద్ర సహకార మార్కెటింగ్ సొసైటీ - డీసీఎంఎస్ పాలకవర్గాలను ఎన్నుకుంటారు.
  3. జిల్లా స్థాయి పదవులు కావడం వల్ల ఆ పోస్టులకు డిమాండ్ అధికంగా ఉంటుంది. పైగా... ఇవే కాకుండా తెలంగాణ రాష్ట్ర సహకార ఆపెక్స్ బ్యాంకు - టీఎస్‌ క్యాబ్‌, తెలంగాణ రాష్ట్ర సహకార మార్కెటింగ్ సమాఖ్య - టీఎస్‌ మార్క్‌ఫెడ్‌ పాలకవర్గాలను సైతం ప్రాధమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల ఛైర్మన్ల నుంచే నియమిస్తారు.
  4. ఇవి రాష్ట్ర స్థాయి పదవులు, పైగా రాష్ట్ర కేబినేట్ మంత్రి హోదా స్థాయి కూడా ఉంటుంది. ఆయా కీలకమైన పదవులపైనే గురిపెట్టిన పలువురు నేతలు సంబంధిత జిల్లాల మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలతో కలిసి తమ తమ జిల్లాల్లో ఎక్కువ సంఘాలను గెలిపించుకుని సీఎం దృష్టిలో పడేందుకు క్షేత్రస్థాయిలో వ్యూహాలు రచిస్తున్నారు.

ఇవీ చూడండి: 25 రోజుల్లో పల్లెల రూపురేఖలు మారాలి : సీఎం కేసీఆర్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.