ETV Bharat / city

"కలెక్టర్లకు వ్యక్తిగత ప్రాధాన్యాలు ఉండొద్దు" - cm kcr on palla pragathi

రానున్న 25 రోజుల్లో రాష్ట్రంలోని గ్రామాల రూపురేఖల్లో మార్పులు రావాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్... అనుకున్న విధంగా ఏ గ్రామం లేకున్నా బాధ్యులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. పంచాయతీ సమ్మేళనం నిర్వహించిన పదిరోజుల తర్వాత అధికారులతో పాటు తాను ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తానని చెప్పారు. మొక్కలు నాటి సంరక్షించడం మంత్రులు, కలెక్టర్ల పనితీరుకు గీటురాయన్న సీఎం... నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిని ఉపేక్షించే సమస్యే లేదని స్పష్టం చేశారు.

cm kcr
cm kcr
author img

By

Published : Feb 11, 2020, 7:48 PM IST

Updated : Feb 12, 2020, 5:07 AM IST

25 రోజుల్లో పల్లెల రూపురేఖలు మారాలి : సీఎం కేసీఆర్

కలెక్టర్ల సదస్సులో ప్రసంగించిన ముఖ్యమంత్రి కేసీఆర్... పలు అంశాలపై వారికి దిశానిర్దేశం చేశారు. రాష్ట్రం ఏర్పడిన చాలా తక్కువ వ్యవధిలోనే అనేక రంగాల్లో అద్భుత ప్రగతి సాధించామన్నారు. సంక్షేమ రంగం, విద్యుత్, మిషన్ భగీరథ, భారీ నీటిపారుదల ప్రాజెక్టుల గురించి వివరించారు. ముఖ్యమైన పనులన్నీ విజయవంతంగా సాగుతున్న తరుణంలో ఇప్పుడు అందరి ముందు అత్యంత ప్రాధాన్యతతో కూడిన పని... పల్లెలు, పట్టణాలు పచ్చదనం, పరిశుభ్రతతో వెల్లివిరియడమని పేర్కొన్నారు.

గ్రామాలకు ప్రతీనెల రూ.339కోట్లు

రెండు విడతలుగా నిర్వహించిన పల్లె ప్రగతి కార్యక్రమం విజయవంతమైందని కేసీఆర్ తెలిపారు. ఈ కార్యక్రమం నిరంతరం సాగాలని అన్నారు. గ్రామాల్లో పచ్చదనం, పరిశుభ్రత వెల్లివిరియాలని చెప్పారు. పనులన్నింటినీ గ్రామ పంచాయతీల ఆధ్వర్యంలో కలెక్టర్లు జరిపించాలని సీఎం తెలిపారు. గ్రామాల అభివృద్ధికి కావాల్సిన అన్ని చర్యలను తీసుకోవడంతో పాటు వేరే ఖర్చులు ఆపైనా సరే గ్రామాలకు ప్రతినెలా రూ.339 కోట్లు నిధులు ఇస్తున్నట్లు చెప్పారు. గ్రామాల్లో మార్పు రాకుంటే మాత్రం ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని స్పష్టం చేశారు.

25 రోజుల్లో మొత్తం మారిపోవాలి..

ప్రజాప్రతినిధులు, అధికారులతో రాబోయే పదిహేను రోజుల్లో జిల్లా స్థాయిలో పంచాయతీ రాజ్ సమ్మేళనం నిర్వహించి గ్రామాలను అభివృద్ధి చేసుకునే పద్ధతి, విధులు, బాధ్యతలు వివరించాలని సీఎం ఆదేశించారు. సమావేశం తర్వాత పది రోజుల గడువిచ్చి గ్రామాల రూపురేఖలు మార్చేందుకు గడువు ఇవ్వాలని తెలిపారు. మొత్తంగా 25 రోజుల్లో గ్రామాల పరిస్థితిలో మార్పు రావాలన్నారు. ఆ తర్వాత తనతో పాటు ఫ్లయింగ్ స్క్వాడ్ ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తాయని చెప్పారు. ఏ గ్రామం అనుకున్న విధంగా లేకపోయినా చర్యలు తప్పవని హెచ్చరించారు. గ్రామాలను బాగా ఉంచుకునే వారికి అవార్డులు, ప్రోత్సాహకాలు కూడా ఉంటాయని తెలిపారు.

నిరంతరం సాగాలి

పల్లె ప్రగతి కార్యక్రమాన్ని కేవలం స్పెషల్ డ్రైవ్​గా కాకుండా నిరంతరం సాగాలని కేసీఆర్ సూచించారు. దేశంలో ఆదర్శ పల్లెలు తెలంగాణలో ఉన్నాయనే పేరు రావాలని... మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు వ్యవస్థతో పనిచేయించాలని చెప్పారు. ప్రతి గ్రామంలో నాటిన మొక్కల్లో 85 శాతం కచ్చితంగా బతికించాలని... గ్రామంలో శ్మశాన వాటికలు, ఖనన వాటికలు, డంపింగ్ యార్డులు ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు. గ్రామాల్లో పర్యటించినప్పుడు తమ దృష్టికి వచ్చిన అత్యవసర, అత్యంత ప్రాముఖ్యత కలిగిన పనులు చేయడానికి ప్రతి కలెక్టర్ వద్ద ఒక్కో కోటి రూపాయల చొప్పున అందుబాటులో ఉంచుతామని తెలిపారు. పల్లె ప్రగతి తరహాలో త్వరలోనే పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని కూడా ప్రభుత్వం ప్రారంభించనున్నట్లు తెలిపారు. పురపాలకశాఖలో ఖాళీలన్నింటినీ భర్తీ చేస్తామని చెప్పారు.

ఏ కార్యక్రమమైనా అక్కడి నుంచే

ఏ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమమైనా ముందుగా ఎస్సీ, ఎస్టీ ప్రాంతాల నుంచే ప్రారంభం కావాలని సీఎం తెలిపారు. దళితవాడలు, గిరిజన తండాలు, ఆదివాసీ గూడాల్లో ప్రజా ప్రతినిధులు, అధికారులు పర్యటించి కార్యక్రమాల అమలును అక్కడి నుంచే ప్రారంభించాలని పేర్కొన్నారు.

సంబంధిత కథనాలు: కలెక్టర్లకు సీఎం కేసీఆర్ నిర్దేశించిన బాధ్యతలు ఇవే!

Last Updated : Feb 12, 2020, 5:07 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.