ఉద్యోగులు, మధ్య తరగతి ప్రజలు కుటుంబ పోషణ కోసం ఆభరణాలు తాకట్టు పెట్టి రుణాలివ్వాలని బ్యాంకులకు వస్తున్నారని ఎస్బీఐ డీజీఎం ఎం.దేబాశిష్ మిశ్రా తెలిపారు. లాక్డౌన్ తర్వాత రుణాల కోసం వచ్చే వారి సంఖ్య పెరిగిందన్నారు. తాము కూడా అందుకు అనుగుణంగానే కొన్ని వెసులుబాట్లు కల్పించామని ఆయన వెల్లడించారు.
పిల్లల చదువు, వాహనాల లోన్, ఇంటి అద్దె కట్టలేని స్థితిలో ఉన్న మధ్యతరగతి, పేద ప్రజలు బంగారు ఆభరణాలను తాకట్టు పెడుతున్నట్లు చెప్పారు. వారికి కేవలం అరగంటలోనే నగదు ఇస్తున్నట్లు తెలిపారు. జంటనగరాల్లోని అన్ని ఎస్బీఐ బ్యాంకుల్లో నూతన విధి విధానాలు అమల్లోకి తీసుకొచ్చినట్లు మిశ్రా వివరించారు.
ఇదీ చూడండి : కూతురి సాయంతో భర్త గొంతు కోసి చంపేసింది..