ETV Bharat / state

Stalls in MGBS: ఎంజీబీఎస్​లో అధిక ధరలు.. స్టాల్​ నిర్వాహకుడికి ఫైన్ - ఆహార పదార్థాల విక్రయం

రాజధానిలోని ప్రధాన ఆర్టీసీ బస్టాండ్​లో ఉన్న స్టాళ్ల నిర్వాహకుల బాగోతం బయటపడింది. ఆహార పదార్థాలను ఎంఆర్పీ ధరల కంటే అధిక రేటుకు విక్రయిస్తున్నట్లు అధికారుల తనిఖీల్లో బహిర్గతమైంది. ఈ తనిఖీల్లో ఎంజీబీఎస్​లోని ఓ స్టాల్ నిర్వాహకుడికి అధికారులు రూ.వెయ్యి జరిమానా విధించారు. అధిక ధరలకు విక్రయిస్తూ ప్రయాణికుల అవసరాలను ఆసరాగా చేసుకుని వారి జేబులకు చిల్లు పెడుతున్నారు. ప్రయాణంలో హడావుడిగా కొనుగోలు చేసేందుకు స్టాళ్ల వద్దకు రాగానే అసలు ధర కంటే రూ.5 వరకు విక్రయిస్తున్నట్లు తనిఖీల్లో ఆర్టీసీ అధికారులు గుర్తించారు.

mgbs
ఎంజీబీఎస్​లో తనిఖీలు
author img

By

Published : Oct 17, 2021, 1:31 PM IST

హైదరాబాద్​లో అత్యంత రద్దీగా ఉండే ఆర్టీసీ బస్టాండ్​లో తినుబండారాల స్టాల్​ నిర్వాహకులు సొమ్ము చేసుకుంటున్నారు. స్టాళ్లలో విక్రయించే ఆహార పదార్థాలకు అధిక ధరలు వసూలు చేస్తున్నారు. ఆర్టీసీ అధికారులు నిర్వహించిన తనిఖీల్లో బాగోతం బట్టబయలైంది. దీనిపై ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. అసలు ధరకంటే అధిక రేటుకు విక్రయించే స్టాళ్ల నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎంజీబీఎస్​లోని ఓ స్టాల్​లో రూ.30 ఉన్న ఒక బిస్కెట్ ప్యాకెట్​ను రూ.35 కు విక్రయిస్తున్నట్లు ఆర్టీసీ అధికారులకు ఫిర్యాదు రావడంతో వెంటనే స్పందించిన అధికారులు నిర్వాహకుడికి రూ.1000 జరిమానా విధించారు.

రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీకి 364 బస్టాండ్లు ఉన్నాయి. వీటిలో సుమారు వంద బస్టాండ్లలో స్టాళ్లు ఏర్పాటు చేయలేదని ఆర్టీసీ అధికారులు తెలిపారు. మిగిలిన సుమారు 264 బస్టాండ్లలో స్టాళ్లను ఏర్పాటు చేశారు. వీటిలో ఎంజీబీఎస్, జేబీఎస్ లాంటి పెద్ద బస్టాండ్లలో ఎక్కువగా స్టాళ్లు ఉంటాయి. ఇవే కాకుండా ఉమ్మడి జిల్లా కేంద్రాల్లోని ప్రయాణ ప్రాంగణాల్లో కూడా స్టాళ్లు ఎక్కువ సంఖ్యలోనే ఏర్పాటు చేశారు. వీటిల్లో చాలా చోట్ల ఎంఆర్పీ కంటే అధిక ధరలకు విక్రయిస్తున్నారని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు.

ఫిర్యాదు రావడంతో తనిఖీలు

ప్రయాణికుల నుంచి ఫిర్యాదులు రావడంతో స్పందించిన ఆర్టీసీ అధికారులు తనిఖీలు చేపట్టారు. నగరంలోని ప్రధాన బస్టాండ్​ ఎంజీబీఎస్​లో ఉన్న స్టాళ్లను తనిఖీ చేశారు. ఈ నేపథ్యంలో అధిక ధరలకు విక్రయిస్తూ మోసాలకు పాల్పడుతున్న వారికి జరిమానాలు విధించారు.

గతేడాదితో పోలిస్తే తగ్గిన ఆర్టీసీ ఆదాయం

రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బస్ స్టేషన్లలో ఉన్న స్టాళ్ల నుంచి ఆర్టీసీకి గతేడాది రూ.64.83 కోట్ల ఆదాయం వచ్చింది. ఈ ఏడాది ఇప్పటి వరకు రూ.59.34 కోట్ల ఆదాయం సమకూరినట్లు అధికారులు తెలిపారు. గతేడాదితో పోల్చితే రూ.5.48 కోట్ల ఆదాయం తగ్గిపోయింది. కరోనా వల్ల బస్సులు సరిగ్గా నడవక ప్రయాణికులు తక్కువగా ఉండడం వల్ల ఆదాయం కోల్పోయినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. బస్టాండ్లలో, ఆర్టీసీ బస్సులకు ఇచ్చే ప్రకటనల ద్వారా గత ఏడాది ఆర్టీసీకి రూ.30 కోట్ల ఆదాయం వచ్చింది. ఈ ఏడాది రూ.18 కోట్ల ఆదాయం సమకూరినట్లు అధికారులు తెలిపారు. గతేడాదితో పోలిస్తే.. రూ.12 కోట్ల ఆదాయం తగ్గినట్లు అధికారులు అంచనా వేశారు.

ఇప్పుడిప్పుడే ఆర్టీసీ పుంజుకుంటున్న సమయంలో ఆర్టీసీ బస్టాండ్​లోని స్టాళ్ల నిర్వాహకుల తీరుపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ఇప్పటికైనా స్టాళ్ల నిర్వాహకులు తిను బండారాలను ఎంఆర్పీ ధరలకే విక్రయించాలని డిమాండ్ చేస్తున్నారు. అసలే కరోనాతో ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న తరుణంలో ప్రయాణికులపై అదనపు ధరలు మరింత భారమవుతాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఇదీ చూడండి: RTC MD SAJJANAR: దసరా పండుగకు వెళ్లే ప్రయాణికులకు టీఎస్​ఆర్టీసీ గుడ్​న్యూస్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.