లాక్డౌన్ కారణంగా వలస కూలీలు, మూగజీవాలు ఆకలికి అలమటించవద్దనే సదుద్దేశంతో దాతలు తమ దాతృత్వాన్ని చాటుకుంటున్నారు. సికింద్రాబాద్ ప్యారడైజ్ వద్ద వీఎన్నార్ ఛారిటబుల్ ట్రస్ట్ ఛైర్మన్ నవీన్ ఆధ్వర్యంలో భోజన ప్యాకెట్లు అందజేశారు. దాదాపు 200 మంది వలస కూలీలకు భోజన ప్యాకెట్లను పంపిణీ చేశారు.
ఇతర రాష్ట్రాల నుంచి ఉపాధి కోసం వలస వచ్చిన కార్మికుల పరిస్థితి దుర్భరంగా మారిందని నవీన్ ఆవేదన వ్యక్తం చేశాడు. కూలీలను ఆదుకునేందుకు ప్రతి ఒక్కరు ముందుకు రావాలని కోరారు. వేసవి ఎండలకు మూగజీవాలు ఆకలి తట్టుకోలేక అల్లాడుతున్నాయన్న నవీన్... జంతువులకు ఆహారం, నీరు అందిస్తూ సేవాతత్పరతను చాటుకున్నాడు.