హైదరాబాద్‌లోని సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియంలో జరిగిన 30వ రహదారి భద్రత వారోత్సవాలకు సినీ నటుడు కల్యాణ్ రామ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రాణం కంటే ఏదీ ఎక్కువ కాదని, ట్రాఫిక్ నియమాలు అందరూ పాటించాలని కల్యాణ్‌రామ్ సూచించారు. భద్రత నియమాలు తెలిసి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే, అదే చివరకు ప్రాణాలను తీసేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.