ముందస్తు అంచనా ప్రకారం గ్రేటర్ పరిధిలో వరద బాధితుల సంఖ్యను సుమారు 5.5 లక్షల మందిగా అంచనా వేశారు. వీరికి రూ.10 వేల చొప్పున రూ.550 కోట్ల సాయం పంపిణీ చేయాల్సి ఉంది. మంగళవారం ఒక్క రోజే రూ.60 కోట్లను పంపిణీ చేశారు. ఇప్పటివరకు 1.90 లక్షల మందికి కలిపి రూ.190 కోట్లు అందజేసినట్లు జీహెచ్‌ఎంసీ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. దీపావళి నాటికి మిగిలిన 3.6 లక్షల మందికి సాయం అందజేయాలన్న లక్ష్యం పెట్టుకున్నామని, గుర్తించిన ప్రాంతాల్లోని బాధితులందరికీ నగదు సాయం అందుతుందని పేర్కొన్నారు.
జోన్ల వారీగా ఇలా :
జోన్ | పంపిణీ మొత్తం రూ.కోట్లలో |
ఎల్బీనగర్ | 35 |
కూకట్‌పల్లి | 35 |
ఖైరతాబాద్ | 35 |
సికింద్రాబాద్ | 30 |
శేరిలింగంపల్లి | 27 |
చార్మినార్ | 28 |
ఇదీ చూడండి: బావిలో ఇంకెవ్వరి మృతదేహాలు లేవు