Cyclone effect on flights: తుపాను దృష్ట్యా ఇవాళ విశాఖ నుంచి అన్ని విమాన సర్వీసులు రద్దు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. మరోవైపు అసని తుపాను ప్రభావం కారణంగా ఆంధ్రప్రదేశ్లోని రాజమహేంద్రవరం విమానాశ్రయం నుంచి విమాన సర్వీసులన్నీ రద్దు చేశారు. హైదరాబాద్, బెంగళూరు, విశాఖ నుంచి 9 విమానాలు రద్దు అయ్యాయి.
గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి పలు సర్వీసులు రద్దయ్యాయి. బెంగళూరు, హైదరాబాద్, చెన్నై ప్రధాన సర్వీసులు రద్దు చేసినట్లు ఇండిగో ప్రకటించింది. విశాఖ, రాజమహేంద్రవరం, కడపకు నడిచే లింక్ సర్వీసులు నిలుపుదల చేసినట్లు తెలిపింది. వాతావరణ మార్పుల అనంతరం సర్వీసులు పునరుద్ధరిస్తామన్న ఇండిగో తెలిపింది.
Rains: ఆగ్నేయ బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన తీవ్రతుపాను 'అసని'.. తుపానుగా బలహీనపడింది. మచిలీపట్నానికి ఆగ్నేయంగా 50 కి.మీ. దూరంలో కేంద్రీకృతమై ఉంది. గడిచిన 6 గంటల్లో గంటకు 12 కి.మీ. వేగంతో కదులుతున్న తుపాను.. దిశ మార్చుకుని ఈశాన్యం వైపునకు కదులుతోంది. నరసాపురం వద్ద పూర్తిగా భూభాగంపైకి రానున్న తుపాన్.. కాకినాడ వద్ద మళ్లీ సముద్రంలోకి వచ్చి బలహీన పడే సూచనలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. రేపు సాయంత్రానికి వాయుగుండంగా బలహీనపడనుంది. పూర్తిగా బలహీనపడేవరకూ తీరం వెంబడే పయనించనుందని అధికారులు అంచనా వేశారు. అసని తుపాను తీరానికి అతిదగ్గరగా రావటంతో గాలుల తీవ్రత తగ్గింది. ప్రస్తుతం తుపాను పరిసర ప్రాంతాల్లో 85 కి.మీ. వేగంతో గాలులు వీస్తున్నాయి. అసని తుపాను కారణంగా 3 మీటర్ల ఎత్తున సముద్రపు అలలు ఎగిసిపడుతున్నాయి. తుపాన్ ప్రభావంతో ఉమ్మడి కోస్తాంధ్రవ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, పలుచోట్ల భారీ నుంచి అతి భారీవర్షాలు కురిసే సూచనలు ఉన్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది.
అసని తుపాను ప్రభావంతో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం కురుస్తోంది. చెట్లు, విద్యుత్ స్తంబాలు నేలకొరిగాయి. విద్యుత్ సరఫరా నిలిచిపోయాయి. పలు గ్రామాలకు సైతం రాకపోకల స్తంభించాయి. ఈ నేపథ్యంలో తుపాను వల్ల విమాన సర్వీలను రద్దు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు.
ఇవీ చదవండి: