Fish Food Festival In Hyderabad Today : రాష్ట్రంలో చేపల ఆహార పండగ కోలాహలంగా సాగుతోంది. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ధి ఉత్సవాల్లో భాగంగా... మృగశిర కార్తె పురస్కరించుకుని ఊరూవాడా చేపలు తింటున్న వేళ... ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు ఫిష్ ఫుడ్ ఫెస్టివల్ కార్యక్రమాలు మూడు రోజులపాటు ఉత్సాహంగా నిర్వహించనున్నారు. హైదరాబాద్ ఇందిరా పార్కు వద్ద ఎన్టీఆర్ మైదానంలో ఫిష్ ఫుడ్ ఫెస్టివల్ కార్యక్రమాన్ని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ లాంఛనంగా ప్రారంభించారు.
Hyderabad Fish Food Festival : పలు స్టాళ్లు కలియ తిరిగిన మంత్రి చేపలు, రొయ్యల వంటకాలను రుచి చూశారు. ఏటా 150 కోట్ల రూపాయలు వెచ్చించి మత్స్య రంగం అభివృద్ధి, మత్స్యకారుల బలోపేతంతోపాటు మార్కెటింగ్ వ్యవస్థపై ప్రత్యేక దృష్టి సారించామని తెలిపారు. తొలిసారి ఏర్పాటైన ఫిష్ ఫుడ్ ఫెస్టివల్ అద్భుతంగా ఉందని, అన్ని రకాల వంటకాలు అందుబాటులో ఉన్నాయని నిర్వాహకులు, మత్స్య ఆహార ప్రేమికులు సంతోషం వ్యక్తం చేశారు.
మత్స్య రంగం కొత్త పుంతలు తొక్కుతున్న నేపథ్యంలో రంగారెడ్డి జిల్లాలోని సరూర్‌నగర్‌లో ఏర్పాటైన ఫిష్ ఫుడ్ ఫెస్టివల్‌ను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రారంభించారు. ఈ స్టేడియంలో 20 స్టాళ్లు కొలువు తీరాయి. చేపలు, రొయ్యలతో తయారు చేసిన బిర్యానీ, పులుసు, ఫ్రై, అపోలో ఫిష్, పకోడి, బంతులు, మిఠాయి వంటి భిన్న రుచుల్లో తయారు చేసిన వంటకాలు, స్నాక్స్ తినేందుకు జంట నగరవాసులు పోటీపడుతున్నారు.
Rush at Fish Markets on Mrigasira Karthi : మృగశిర కార్తె స్పెషల్.. చేపలకు మామూలుగా డిమాండ్ లేదుగా..!
Three Days Fish Fest In NTR Grounds : సాధారణంగా తెలంగాణ సంస్కృతి, సంప్రదాయం ప్రకారం... మృగశిర కార్తె... రోజు చేపలు ఆహారంలో భాగం చేసుకోవడం అనవాయితీ. ఉరుకుల పరుగుల జీవితాల్లో తీరిక లేకుండా గడుతున్న కుటుంబాలకు... ఇంట్లో చేసుకునే తీరిక లేనివారు ఈ ప్రదర్శనను సందర్శించవచ్చు. ఇష్టమైనవి తిని ఆహ్లాదంగా గడపవచ్చు. డిమాండ్ దృష్ట్యా సొంతంగా మార్కెటింగ్ చేసుకుంటూ... ఆహార ప్రియులకు మత్స్య వంటకాలు సరఫరా చేస్తూ ఆదాయం పొందుతున్నాయని అమ్మకందారులు అంటున్నారు.
Fish Food Festival : బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి, కుల వృత్తులపై ఆధారపడి జీవిస్తున్న కుటుంబాలలో వెలుగులు నింపాలన్నది ప్రభుత్వ లక్ష్యం. సామాజికంగా ఆర్థికంగా అభివృద్ధిలోకి తీసుకురావడం ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయాలన్న ధృఢ సంకల్పంతో ప్రభుత్వం ముందుకు పోతుందని... రాష్ట్రంలో రెండు మూడింతలు పెరిగిన మత్స్య సంపద వినియోగంపై సర్కార్ ప్రత్యేక దృష్టి సారించిందని మత్స్యశాఖ అధికారులు చెబుతున్నారు.
33 జిల్లాల్లో మొత్తం శిక్షణ పొందించి మహిళా సంఘాల ఆధ్వర్యంలో 800 స్టాళ్లు కొలువు తీరాయి. వచ్చే ఏడాది 2000 స్టాళ్లు ఏర్పాటు చేసి తెలంగాణ ప్రజలకు భిన్నమైన రుచుల్లో చేపలు, రొయ్యల ఉత్పత్తులు రుచులు చూపి వినియోగం రెట్టింపు చేయాలన్నది సర్కారు లక్ష్యంగా అధికారులు వెల్లడించారు.
ఇవీ చదవండి: