ట్రిపుల్ ఐటీల చరిత్రలో మొదటిసారిగా ఈ ఏడాది సీట్లు మిగిలిపోయాయి. ఇప్పటికి 3 సార్లు పిలిచినా సీట్లు భర్తీ కాలేదు. జులైలో ఒకటి, రెండు కౌన్సెలింగుల్లోనే సీట్లన్నీ నిండిపోయే ఆర్జీయూకేటీ ట్రిపుల్ ఐటీల్లో.. ఈ ఏడాది నవంబరు వచ్చినా, 3 కౌన్సెలింగులు నిర్వహించినా ఇంకా 119 సీట్లు మిగిలిపోయాయి. ఆర్జీయూకేటీ పరిధిలోని నూజివీడు, ఇడుపులపాయ, శ్రీకాకుళం, ఒంగోలులో ట్రిపుల్ ఐటీ కళాశాలలు ఉన్నాయి.
ఈ ఏడాది ప్రవేశాలకు పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలనూ పరిగణనలోకి తీసుకుంటామని, ప్రభుత్వం ప్రకటించడంతో అవి రావడానికి ఆలస్యమైంది. గతంలో మాదిరిగా 1:3 నిష్పత్తిలో కాకుండా ఈసారి 1:1 నిష్పత్తిలో విద్యార్థులను కౌన్సెలింగ్‌కు పిలవాలని నిర్ణయించడం తీవ్ర జాప్యానికి దారి తీసింది. దీంతో విద్యార్థులు ప్రైవేటు బాటపట్టారు. ప్రస్తుతం మరో విడత కౌన్సెలింగ్ నిర్వహించినా.. ఇప్పటికే ఫీజులు కట్టి ప్రైవేటు కళాశాలల్లో చేరిన విద్యార్థులు తిరిగి వస్తారనే నమ్మకం లేదు.
ఇవీ చదవండి: