ETV Bharat / state

జీఎంఆర్​ ఎయిర్​ కార్గోతో మొదటి ఫీడర్​ సర్వీస్​ ప్రారంభం - జీఎంఆర్​ ఎయిర్​ కార్గో సేవలు ప్రారంభం

టీఎస్ఆర్టీసీ సరకు రవాణాలో భాగంగా జీఎంఆర్ హైదరాబాద్ ఆధ్వర్యంలో ఎయిర్ కార్గో మొదటి ఫీడర్ సర్వీస్​ను రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రారంభించారు. ఈ మేరకు అవగాహన ఒప్పందంపై ఆర్టీసీ ఎండీ సునీల్​ శర్మ.. ఎం.ఓ.యూపై సంతకం చేశారు. ఈ ఒప్పందంతో తెలంగాణ నుంచి కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్రలకు ఆర్టీసీ ద్వారా ఆయా సరకు రవాణా జరుగుతుందని పువ్వాడ పేర్కొన్నారు.

first feed service is started from gmr air cargo
జీఎంఆర్​ ఎయిర్​ కార్గో మొదటి ఫీడర్​ సర్వీస్​ ప్రారంభం
author img

By

Published : Nov 9, 2020, 12:56 PM IST

జీఎంఆర్ ఎయిర్ కార్గోతో టీఎస్ఆర్టీసీ కార్గో బస్ ఫీడర్ సర్వీస్ (బీ.ఎఫ్.ఎస్) అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఈ మేరకు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సమక్షంలో ఆర్టీసీ సీఎండీ సునీల్ శర్మ.. జీఎంఆర్ హైదరాబాద్ ఎం.ఓ.యూపై సంతకం చేశారు. ఎయిర్ కార్గో మొదటి ఫీడర్ సర్వీస్​ను రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ శంషాబాద్ విమానాశ్రయంలో ప్రారంభించారు.

ఎగుమతులు, దిగుమతులు

హైదరాబాద్ నుంచి ఫార్మా ఉత్పత్తులు ప్రపంచవ్యాప్తంగా ఎగుతుమతి అవుతున్నాయని మంత్రి పువ్వాడ తెలిపారు. ఈ ఒప్పందంతో ఎగుమతులు, దిగుమతులు, కార్గో ఫస్ట్ మైల్, చివరి మైల్ బస్ ఫీడర్ సేవల ద్వారా సంస్థ అదనపు ఆదాయాన్ని ఆర్జించడానికి అవకాశం కలుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అంతర్జాతీయ ఎగుమతి, దిగుమతి, ఏరోస్పేస్, ఇంజినీరింగ్ వస్తువులు, ఎలక్ట్రానిక్ వస్తువులు, సముద్ర ఉత్పత్తులు, పండ్లు, కూరగాయలు తదితర వాటిని ఎగుమతి చేసుకునే అవకాశం కలుగుతుందని వివరించారు. విమానాశ్రయంలోకి వచ్చే అంతర్జాతీయ దిగుమతులను ఆంధ్రప్రదేశ్, కేరళ, ఛత్తీస్ గఢ్​, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు ప్రాంతాలకు చేరవేయడమే కాకుండా ఇతర దేశాలైన యూఎస్, ఈయూ, ఆఫ్రికా, మిడిల్-ఈస్టర్న్, ఫార్-ఈస్టర్న్ దేశాలకు ఎగుమతులు, దిగుమతులు సకాలంలో కొనసాగించవచ్చని పేర్కొన్నారు.

టీఎస్​ ఆర్టీసీ కౌంటర్లు

ఈ అవగాహన ఒప్పందంలో భాగంగా ప్రధాన ఫీడర్, డెలివరీ మార్గాల్లో కార్గో బస్ సేవలను జీఎంఆర్ ప్రారంభించనుంది. జీఎంఆర్ కార్గో బుకింగ్, డెలివరీ సంబంధిత సేవల కోసం కార్గో టెర్మినల్ వద్ద టీఎస్ ఆర్టీసీ కౌంటర్లను ఏర్పాటు చేయనున్నారు. -20 డిగ్రీల ఉష్ణోగ్రత వరకు కార్గోను నిర్వహించడానికి ఇక్కడ కోల్డ్ రూములు, ప్రాసెసింగ్ సౌకర్యాలున్నాయని జీఎంఆర్ వర్గాలు వెల్లడించాయి.

ఎయిర్ కార్గో ద్వారా అంతర్జాతీయ ఎయిర్ కార్గో వాణిజ్యం చేసే వారికి, నూతన వ్యాపారావకాశాలకు ఇది ఉపయోగపడుతుందని తెలిపాయి.

ఇదీ చదవండి: కశ్మీర్​లో ఇద్దరు తెలుగు జవాన్ల వీరమరణం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.