ETV Bharat / state

RTC BUS FIRE: ఆర్టీసీ బస్సులో మంటలు.. డ్రైవర్ అప్రమత్తతతో తప్పిన ముప్పు - బస్సు డ్రైవర్ చాకచక్యం

RTC BUS FIRE: బస్సు డ్రైవర్ చాకచక్యంతో పెను ప్రమాదం తప్పింది. ఆర్టీసీ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. డ్రైవర్ అప్రమత్తం కావడంతో అందరు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటన సికింద్రాబాద్​లోని లాలాపేట్​లో జరిగింది.

RTC BUS FIRE
ఆర్టీసీ బస్సులో మంటలు
author img

By

Published : Feb 22, 2022, 6:37 PM IST

Updated : Feb 22, 2022, 7:45 PM IST

RTC BUS FIRE: ఆర్టీసీ బస్సుకు తృటిలో ప్రమాదం తప్పింది. ​బస్సు స్టీరింగ్​ వద్ద ​మంటలు ఒక్కసారిగా చెలరేగడంతో ప్రయాణికులంతా భయాందోళనకు గురయ్యారు. డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించి రోడ్డు పక్కనే బస్సును నిలిపేశారు. ఈ ఘటన సికింద్రాబాద్​లోని లాలాపేట్ ఫ్లై ఓవర్​పై చోటు చేసుకుంది.

ఆర్టీసీ బస్సులో మంటలు

రాణిగంజ్-2​ డీపోకు చెందిన ఆర్టీసీ బస్సులో ప్రమాద సమయంలో దాదాపు 60 మంది ప్రయాణిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో వెంటనే అప్రమత్తమైన డ్రైవర్ బస్సును పక్కకు నిలిపి ప్రయాణికులు అందరినీ దించేశారు. అనంతరం నీళ్లు చల్లి మంటలను ఆర్పివేశారు. ప్రమాద సమయంలో డ్రైవర్​ చాకచక్యంగా వ్యవహరించడంతో ప్రయాణికులంతా ఊపిరి పీల్చుకున్నారు. రోడ్డుపై పక్కనే బస్సు నిలిచిపోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు.

Last Updated : Feb 22, 2022, 7:45 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.