ఆంధ్రప్రదేశ్ కృష్టా జిల్లాలోని విజయవాడ బెంజిసర్కిల్ సమీపంలోని రిలయన్స్ దుకాణాల సముదాయంలో అగ్ని ప్రమాదం జరిగింది. బిల్డింగ్ మొదటి అంతస్తులోని చెప్పుల దుకాణంలో మంటలు వ్యాపించాయి. సుమారు 60శాతానికిపైగా పాదరక్షలు మంటల్లో కాలిపోయాయి. ఈ సముదాయంలో వస్త్ర దుకాణం.... కార్పొరేట్ కార్యాలయంతో పాటు... ఇతర కార్యాలయాలు ఉన్నాయి.
సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. ఈ క్రమంలో ఫైర్ సిబ్బంది ఒకరికి గాయాలయ్యాయి. విద్యుత్ షార్ట్ సర్క్యూటే ప్రమాదానికి కారణమై ఉంటుందని ప్రాధమికంగా అంచనా వేశారు. ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు.
ఇదీ చదవండి: తేనెటీగల దాడిలో వ్యక్తి మృతి