Fire Accident in Clothing Store at Panama : హైదరాబాద్ నగరంలో మరో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. విజయవాడ జాతీయ రహదారి పక్కనే ఉన్న వస్త్ర దుకాణం, ఫర్నీచర్ గోదాంలో మంటలు చెలరేగాయి. పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. నిర్వాహకులు దుకాణం మూసివేసి వెళ్లిన తర్వాత ప్రమాదం చోటు చేసుకుంది. దుకాణంలో వస్త్రాలు పూర్తిగా బుగ్గి పాలయ్యాయి. ఆనుకుని ఉన్న ఫర్నీచర్ గోదాంలోకి మంటలు విస్తరించడంతో.. ఫర్నీచర్ అగ్నికి ఆహుతైంది. ఒక్కసారిగా మంటలు ఎగిసిపడటంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. బస్సుల కోసం వేచి ఉన్న ప్రయాణికులు, వాహనదారులు పరుగులు తీశారు. దీంతో కొద్దిసేపు ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.
Recent Fire Accident in Hyderabad : మంటలు ఎగిసిపడుతుండటంతో స్థానికులు గమనించి.. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుంది. డీఆర్‌ఎఫ్, పోలీసు సిబ్బంది మంటలు అదుపు చేసేందుకు ప్రయత్నం చేశారు. ఐదు అగ్నిమాపక శకటాలతో సుమారు రెండున్నర గంటలు శ్రమించి మంటలను అదుపు చేశారు. ప్రమాదంలో దుకాణంలో వస్త్రాలు, గోదాంలో ఫర్నీచర్ అగ్నికి ఆహుతయ్యాయి. ఈ ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు వెల్లడించారు.
'హైదరాబాద్‌లోని వనస్థలిపురం పనామా వద్ద రహదారి పక్కనే ఉన్న విడెమ్స్ వస్త్ర దుకాణం, పక్కనే ఉన్న ఫర్నీచర్ గోదాం రెండింటికీ ఒకటే యాజమాన్యం. వస్త్ర దుకాణం, ఫర్నీచర్ గోదాం మూసివేసి నిర్వాహకులు ఇంటికి వెళ్లిన తర్వాత ప్రమాదం జరిగింది. మొదట వస్త్ర దుకాణంలో మంటలు చెలరేగాయి. అవి పెద్దఎత్తున వ్యాపించి పక్కనే ఉన్న ఫర్నీచర్ గోదాంకు విస్తరించాయి. మంటల ధాటికి వస్త్ర దుకాణం, ఫర్నీచర్ గోదాం రెండింటి పైకప్పులు కుప్ప కూలిపోయాయి. ప్రమాద సమయంలో ఆయా దుకాణాల్లో ఎవరూ లేకపోవడంతో పెను ముప్పు తప్పింది.' - పోలీసులు
Fire Accident At Begum Bazar : హైదరాబాద్‌లో మరో అగ్ని ప్రమాదం.. టెంట్‌హౌజ్‌లో చెలరేగిన మంటలు
"అగ్నిప్రమాదం జరిగిన ప్రదేశంలో చుట్టూ గోదాంలు ఉన్నాయి. మంటలు వాటికి వ్యాప్తి చెందకుండా ఉండేలా అదుపులోకి తీసుకువచ్చాం. ప్రమాదం జరిగిన గోదాంలో పాలసీ రింగ్ ఏసీ సిస్టమ్ ఉంది. అందువల్ల ప్రమాదం జరిగినప్పుడు మొత్తం కుప్పకూలిపోయింది." - అగ్నిమాపక శాఖ అధికారి
Fire accident in Vanasthalipuram : ఏ కారణంగా మంటలు చెలరేగాయి అనే విషయంపై ప్రస్తుతం పోలీసులు దృష్టి సారించారు. అయితే ప్రమాదం జరిగిన తీరు అనుమానాలకు తావిస్తోందని దుకాణం నిర్వాహకులు వాపోతున్నారు. విద్యుత్‌కు సంబంధించి మెయిన్ నిలిపివేసినా.. ప్రమాదం ఎలా జరుగుతుందంటున్నారు. దీనిపై పోలీసులు దర్యాప్తు జరపాలని కోరుతున్నారు. కుట్ర కోణం ఏమైనా ఉందేమోనని దుకాణ యజమాని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అన్ని విషయాలను పరిశీలించి విచారణ జరుపుతామని పోలీసులు వెల్లడించారు.
ఇవీ చదవండి :