హైదరాబాద్ కవాడిగూడలోని ఓ ఇంట్లో అగ్నిప్రమాదం జరిగింది. స్థానిక తాళ్ల బస్తీలో మల్లయ్య హోటల్ సమీపంలోని ఇంట్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. గమనించిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు.
ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. ప్రమాదం జరిగిన సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడం వల్ల ముప్పు తప్పింది. ఇంట్లోని గృహాపకరణాలన్నీ అగ్నికి ఆహుతయ్యాయి. షార్ట్ సర్క్యూటే ప్రమాదానికి కారణమై ఉంటుందని అధికారులు అనుమానిస్తున్నారు.
- ఇవీ చూడండి: షాకింగ్ న్యూస్: మరో 276 మంది భారతీయులకు కరోనా