ETV Bharat / state

Fingerprint Scam Accused Arrested : వేలిముద్రలు డౌన్​లోడ్ చేస్తారు.. మీ ఖాతా నుంచి నగదు విత్ డ్రా చేస్తారు..

author img

By ETV Bharat Telangana Team

Published : Aug 29, 2023, 5:55 PM IST

Updated : Aug 29, 2023, 6:02 PM IST

Fingerprint Scam Accused Arrested In Hyderabad : సైబర్ నేరగాళ్లపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నా.. రోజుకో రీతిలో కొత్త పంథాలో కేటుగాళ్లు నేరాలకు పాల్పడుతూనే ఉన్నారు. తాజాగా ఇప్పుడు మోసగాళ్ల గురి.. వేలిముద్రలపై పడింది. తాజాగా వేలిముద్రలు చోరీ చేసి నగదు విత్ డ్రా చేస్తున్న ముఠాలోని ఇద్దరు నిందితులను సీఐడీ అధికారులు అరెస్ట్ చేశారు.

Fingerprint scam Accused Arrested In Hyderabad
Fingerprint scam Accused Arrested

Fingerprint Scam Accused Arrested In Hyderabad : సైబర్ నేరగాళ్లపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నా.. రోజుకో రీతిలో కొత్త పంథాలో కేటుగాళ్లు నేరాలకు పాల్పడుతూనే ఉన్నారు. తాజాగా ఇప్పుడు మోసగాళ్ల గురి.. వేలిముద్రలపై పడింది. వేలిముద్రలతో కూడిన పత్రాల్ని కొట్టేసి నకిలీలను సృష్టిస్తున్నారు. వాటి ఆధారంగా బ్యాంకు ఖాతాల్లోని సొమ్ము కాజేస్తున్నారు.

Fingerprint Scam Accused Arrested In Hyderabad : వేలిముద్రలు చోరీ చేసి నగదు విత్ డ్రా చేస్తున్న ముఠాలోని మరో ఇద్దరు నిందితులను సీఐడీ అధికారులు అరెస్ట్ చేశారు. బిహార్​కు చెందిన రంజిత్, బెంగళూరు​కు చెందిన సఫత్ ఆలంను సీఐడీ అధికారులు అరెస్ట్ చేసి రిమాండ్​కు తరలించారు. గతేడాది డిసెంబర్​లో నగరానికి చెందిన విశ్రాంత ఉద్యోగి ఖాతాలో నుంచి విడతల వారీగా రూ.24వేల రూపాయలు విత్​ డ్రా అయ్యాయి. అతని ప్రమేయం లేకుండా ఖాతాలో నుంచి నగదు పోవడాన్ని గుర్తించిన విశ్రాంత ఉద్యోగి సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దర్యాప్తు చేపట్టిన సీఐడీ అధికారులు వేలిముద్రల చోరీతో ఈ మోసం జరిగినట్లు తేల్చారు. ప్రధాన నిందితుడు అక్రంను సీఐడీ అధికారులు గతేడాది డిసెంబర్​లోనే అరెస్ట్ చేశారు. రిజిస్ట్రేషన్లు, రెవన్యూ శాఖ వెబ్ సైట్ల నుంచి నిందితులు సేల్ డీడ్ పత్రాలను డౌన్ లోడ్ చేసుకొని వాటిలో ఉన్న వేలిముద్ర గుర్తులను కంప్యూటర్లలో స్కాన్ చేసినట్లు సీఐడీ అధికారుల దర్యాప్తులో తేలింది. డాక్యుమెంట్లలో ఉన్న ఆధార్ కార్డు, ఫోన్ నెంబర్లు సైతం సేకరించినట్లు గుర్తించారు. ఆ తర్వాత సిలికాన్ వేలిముద్రలు రూపొందించి కస్టమర్ సర్వీస్ పాయింట్ మిషన్లలో నగదు తీసుకున్నట్లు తేల్చారు. ఈ ముఠా పలుచోట్ల ఈ తరహా మోసాలకు పాల్పడినట్లు సీఐడీ అధికారుల దర్యాప్తులో తేలింది.

Cyber Fruad: ఇదెక్కడి దొంగ తెలివిరా బాబు... సైబర్ నేరగాళ్ల కొత్త రూట్

Fingerprint Theft in Telangana 2023 : సైబర్ నేరగాళ్లు వేలిముద్ర ప్రింట్‌ను తొలుత పేపర్‌పైకి తీసుకుని గాజు గ్లాస్‌పై ముద్రిస్తారు. దానిపై రబ్బర్ పోస్తే.. పాలీమర్ ప్రింట్ తయారవుతుంది. అదే నకిలీ వేలిముద్రగా మారుతుంది. బయోమెట్రిక్ యంత్రంలో ఆ నకిలీ వేలిముద్రల్ని పెట్టి బ్యాంకు ఖాతాలోని నగదు కాజేస్తున్నారు. సైబర్ నేరస్థులు ఆంధ్రప్రదేశ్ రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ డిపార్ట్‌మెంట్‌.. ఐజీఆర్‌ఎస్‌లోని భూలావాదేవీల దస్త్రాలు కాజేశారు. ఐజీఆర్‌ఎస్‌ వెబ్‌సైట్‌లోనూ పలు లొసుగులు ఉండటం గమనార్హం. వీటి ఆధారంగానే తెలుగు రాష్ట్రాల్లో చాలా వరకు మోసాలకు తెర లేపారు. రూ.14.64 లక్షల్ని నేరస్థులు ఇలా కాజేసినట్లు సైబరాబాద్ పోలీసులు గుర్తించారు.

సైబర్ నేరగాళ్లు మీ ఖాతాలోని డబ్బుల్ని కొట్టేస్తే వెంటనే 1930 నంబర్‌కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలి. లేదా జాతీయ సైబర్ క్రైమ్ పోర్టల్ లోకి వెళ్లి అందులో ఫిర్యాదు చేయాలి. ఒకవేళ బాధితుడి ప్రమేయం లేకుండా డబ్బు పోతే చాలా ఉదంతాల్లో ఫిర్యాదు చేసిన 45 రోజుల్లోపు తిరిగి జమ చేస్తున్నారు.

Cyber crime news : లాభాల పేరిట వల.. రెండు నెలల్లో రూ.300 కోట్ల మోసం

Last Updated : Aug 29, 2023, 6:02 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.